AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: అంతా అక్కడి నుంచి వచ్చినవారే.. మంత్రి హరీష్ రావుకు పీసీసీ చీఫ్ రేవంత్ కౌంటర్

Telangana PCC chief: మంత్రి హరీష్ రావు కామెంట్స్‌కు TPCC చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి TDP అధినేత చంద్రబాబు తెలంగాణ PCC పదవి ఇప్పించారనే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తనదైన తరహాలో వ్యాఖ్యానించారు.

Revanth Reddy: అంతా అక్కడి నుంచి వచ్చినవారే.. మంత్రి హరీష్ రావుకు పీసీసీ చీఫ్ రేవంత్ కౌంటర్
Telangana Pcc Chief Revanth Reddy
Sanjay Kasula
|

Updated on: Jul 09, 2021 | 6:44 PM

Share

మంత్రి హరీష్ రావు కామెంట్స్‌కు TPCC చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి TDP అధినేత చంద్రబాబు తెలంగాణ PCC పదవి ఇప్పించారనే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తనదైన తరహాలో వ్యాఖ్యానించారు. హరీష్ రావును మంత్రిని చేసింది కాంగ్రెసు పార్టీయే కదా అంటూ కామెంట్ చేశారు.  TRSలో ఉన్నవాళ్లంతా TDP వాళ్లే కదా.. అని ప్రశ్నించారు. CM KCR, తలసాని శ్రీనివాస్ యాదవ్, దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి ఇంకా చాలా మంది మంత్రులు TDP నుండి రాలేదా..? అంటూ ప్రశ్నించారు. TDP నుంచి TRSలో చేరినవారు మంత్రులుగా కూడా ఉన్నారని ఆయన అన్నారు.

కాంగ్రెసులో చేరే ముందు తాను అన్ని పదవులకూ రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. పార్టీ వల్లనే తనకు పదవి వచ్చింది కాబట్టి తన రాజీనామాను TDP అధ్యక్షుడు చంద్రబాబుకు ఇచ్చానని ఆయన అన్నారు. రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీకి కూడా వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు.

తాను రాజీనామా చేసిన తర్వాత గన్ మెన్ ను, పీఎలను సరెండర్ చేశానని చెప్పుకొచ్చారు. తాను TDP అయితే KCR ఏమిటని ఆయన అడిగారు. TDPలో కష్టపడ్డందుకు ఇప్పుడు నేషనల్ పార్టీలో అవకాశం వొచ్చిందని.. దానికి వీళ్ళకేందుకు భుజాలు తడుముకుంటున్నారు అంటూ ఎద్దేవ చేశారు. TRSకు KCR అధ్యక్షుడు ఎలానో, అలా తాను కాంగ్రెసుకు అధ్యక్షుడిని అని రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు.

ఇవి కూడా చదవండి : Fire Accident: అగ్నిప్రమాదంతో ఉలిక్కిపడ్డ ఢాకా.. 52 మంది సజీవ దహనం..కాలిబూడిదైన జ్యూస్‌ ఫ్యాక్టరీ

Cabinet Meeting: ఈనెల 13న తెలంగాణ కేబినెట్ భేటీ.. కరోనా పరిస్థితి, వ్యవసాయంతోపాటు పలు అంశాలపై చర్చ