AP BJP: స్వార్థ ప్రయోజనాల కోసమే జల వివాదాల్ని సృష్టిస్తున్నారు : కర్నూలు సమావేశంలో బీజేపీ నేతల మండిపాటు
సాగునీళ్లు సముద్రంలోకి వృధాగా పారుతున్నాయని ఏపీ బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాయలసీమ రైతుల కడుపు కొడుతున్నారని..
BJP Kurnool meeting: సాగునీళ్లు సముద్రంలోకి వృధాగా పారుతున్నాయని ఏపీ బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాయలసీమ రైతుల కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అధ్యక్షతన ఇవాళ కర్నూలులో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరును తప్పుబట్టారు. ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వార్థ ప్రయోజనాల కోసమే జల వివాదాల్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు.
ఏపీ బీజేపీ అగ్రనేతలతోపాటు, రాయలసీమలోని పార్టీ కీలక నేతలు హాజరైన ఈ సమావేశంలో తెలుగురాష్ట్రాల మధ్య జల వివాదంపై ప్రధానంగా చర్చించారు. రాయలసీమ అభివృద్ధిపై రోడ్‌మ్యాప్ రూపొందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాయలసీమలోని నీటి ప్రాజెక్టులు తోపాటు, ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం.. అభివృద్ధి అంశాలపై ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించారు.
ఈ సమావేశానికి బీజేపీ ఏపీ ఇంఛార్జి సునీల్ ధియోధర్ తోపాటు, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్సీ వాకాటి, మాజీ మంత్రి వర్యులు ఆదినారాయణ, రావెల కిశోర్ బాబు తదితర రాయలసీమకు చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Read also: YS Jagan: బద్వేల్ నియోజయకవర్గానికి ఎప్పుడూ మంచి జరగలేదు : సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి