- Telugu News Andhra Pradesh News Andhra pradesh cm ys jagan foundation stone development projects badvel in kadapa district
AP CM YS Jagan: కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్ సుడిగాలి పర్యటన.. బద్వేలులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం.. చిత్రాలు..
కడప జిల్లా బద్వేల్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.500 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
Updated on: Jul 09, 2021 | 2:06 PM

కడప జిల్లా బద్వేల్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.500 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

రెండో రోజూ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బద్వేలులో పర్యటిస్తున్నారు. బద్వేలులో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.

మధ్యాహ్నం తర్వాత ఎర్రముక్కపల్లెలోని సీపీ బ్రౌన్ రీసెర్చ్ సెంటర్‌కు చేరుకుని బ్రౌన్ విగ్రహాన్ని ఆవిష్కరించి, సీపీ బ్రౌన్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

కలెక్టరేట్ సమీపంలోని మహావీర్ సర్కిల్‌కు చేరుకుని శిలాఫలకాలను ఆవిష్కరించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం.

వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం చేరుకుని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి దివంగత వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిల విగ్రహాలను ఆవిష్కరించారు.
