Telugu States Water War: లేఖాస్త్రాలు, మాటల యుద్ధాలు ఓవర్.. ఇప్పుడు ఫిర్యాదుల వంతు.. సీన్‌లోకి ఏపీ బీజేపీ
తెలుగు రాష్ట్రాల నీళ్ల పంచాయితీ కేంద్రం చెంతకు చేరింది. లేఖలు ఆపి. ఫిర్యాదు దాకా వెళ్లింది ఏపీ. విభజన చట్టానికి విరుద్ధంగా ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నారని ఆరోపించింది....
తెలుగు రాష్ట్రాల నీళ్ల పంచాయితీ కేంద్రం చెంతకు చేరింది. లేఖలు ఆపి. ఫిర్యాదు దాకా వెళ్లింది ఏపీ. విభజన చట్టానికి విరుద్ధంగా ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నారని ఆరోపించింది. అటు తెలంగాణ మాత్రం ఏపీ వర్షన్‌ను కొట్టిపడేసింది. హక్కుల కోసం పోరాడుతామని స్పష్టం చేసింది. లెటెస్ట్‌గా సీన్‌లోకి వచ్చిన ఏపీ బీజేపీ.. జల జగడంలో ఇద్దరు సీఎంల తీరుపై ఫైరయ్యింది.
నిన్నటిదాకా లేఖలు ఇవాళ ఫిర్యాదు
తెలంగాణ ప్రాజెక్ట్‌లపై ఫిర్యాదులను కంటిన్యూ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. నిన్నటిదాకా లేఖలు రాసింది. ఇవాళ నేరుగా వెళ్లి కేంద్రమంత్రికి ఫిర్యాదు చేసింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు.. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశారు. తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని తక్షణం ఆపించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రాజెక్ట్‌ల దగ్గర సీఐఎస్‌ఎఫ్ భద్రత కావాలంటున్న ఏపీ
కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు పరిధిని వెంటనే నోటిఫై చేయాలని, ప్రాజెక్ట్‌ల దగ్గర CISF భద్రత కల్పించాలన్నది ఏపీ ప్రధాన డిమాండ్. తెలంగాణలో కొత్త ప్రాజెక్ట్‌లపై అభ్యంతరం చెబుతూ వినతి పత్రాన్ని అందించారు విజయసాయిరెడ్డి. 8 ప్రాజెక్ట్‌లతో 183 TMCలను తరలించేలా తెలంగాణ పనులు చేపడుతోందని ఏపీ ఆరోపిస్తోంది. మరో 10 ప్రాజెక్ట్‌లను విభజన చట్టానికి విరుద్ధంగా నిర్మిస్తోందని అభ్యంతరం చెబుతోంది. పాలమూరు రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, తుమ్మిళ్ల, మిషన్ భగీరథ, కల్వకుర్తి, నెట్టెంపాడు, SLBC విస్తరణ ద్వారా 183 టీఎంసీలను తరలిస్తోందని కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఏపీ వాదనను కొట్టిపడేశారు తెలంగాణ మంత్రులు. దొంగ ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని అడ్డుకుంటూనే తెలంగాణ హక్కుల్ని రక్షించుకుంటామన్నారు. లేని వాటి కోసం సీఎం జగన్ తాపత్రాయపడుతున్నారని విమర్శించారు మంత్రి జగదీష్.
నీళ్ల కొట్లాటలో సడెన్‌గా సీన్‌లోకి ఎంటరైంది ఏపీ బీజేపీ. ఇరు రాష్ట్రాల సీఎంలు స్వార్ధ ప్రయోజనాల కోసం జల వివాదాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడింది. అయితే ఆరోపణలకే పరిమితం అవుతుందా..? సమస్య పరిష్కారం కోసం హైకమాండ్‌కి ఏమైనా సూచనలు చేయబోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి లేఖాస్త్రాలు.. మాటల యుద్ధాలు కాస్త ఫిర్యాదుల దాకా వెళ్లాయి. ముందు ముందు నీళ్ల కొట్లాట ఎటువైపు టర్న్ అవుతుందన్నది చర్చనీయాంశంగా మారింది.
Also Read: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. మొదటి దశలో 50,000 ఉద్యోగాల భర్తీ