AP Weather Report: ఈనెల 11న బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజులపాటు భారీ వర్షాలు, ఈదురు గాలులు

AP Weather Report: రాగాల మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం నాటి ఉత్తర , దక్షిణ..

AP Weather Report: ఈనెల 11న బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజులపాటు భారీ వర్షాలు, ఈదురు గాలులు
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jul 09, 2021 | 6:11 PM

AP Weather Report: రాగాల మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం నాటి ఉత్తర , దక్షిణ ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీన పడిందని… ఈ రోజు తూర్పు – పశ్చిమ ఉపరితల ద్రోణి 20°N వద్ద సముద్ర మట్టం నుండి 2.1 కిమీ నుండి 5.8 కిమీ మధ్య వుందని వాతావరణశాఖ పేర్కొంది. దీంతో జూలై 11 న ఉత్తర ఆంధ్రా , దక్షిణ ఒడిస్సా తీరాలకు మధ్య ఉన్న వాయువ్య బంగాళాఖాతంలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

దీంతో ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు , ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ముఖ్యంగా ఈ నెల 11న ఉత్తర కోస్తా ఆంధ్రాలో భారీ నుండి అతిభారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి వేగంగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని మత్య్సకారులు సముద్రంపై వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.

Also Read: మొదటిసారిగా ‘భూమి’ని అభిమానులకు పరిచయం చేసిన హరితేజ.. తల్లిలా ముద్దుగా ఉందంటున్న ఫ్యాన్స్