Tragedy: విశాఖలో విషాదం..! ముద్దులొలికే రెండేళ్ల బాలుడితో తల్లి బలవన్మరణం..!
రెండ్రోజుల్లో ముద్దొలొలికే రెండేళ్ళ కొడుకు పుట్టినరోజు. ఆ మరుసటి రోజే తల్లి జన్మదినం..! ఇంతలో ఏమైందో ఏమో కానీ.. చిన్నారితో పాటు తల్లి ఆత్మహత్య చేసుకుంది...
Mother suicide with two-year-old boy: రెండ్రోజుల్లో ముద్దొలొలికే రెండేళ్ళ కొడుకు పుట్టినరోజు. ఆ మరుసటి రోజే తల్లి జన్మదినం..! ఇంతలో ఏమైందో ఏమో కానీ.. చిన్నారితో పాటు తల్లి ఆత్మహత్య చేసుకుంది. తను ఉంటున్న అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్థు పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఘటనా స్థలంలోనే తల్లి ప్రాణాలు కోల్పోగా.. కొన ఊపిరితో ఉన్న రెండేళ్ళ బాబును ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. విశాఖ గాజువాక చుక్కవానిపాలెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఘటన వివరాల్లోకి వెళితే, విశాఖ నగరంలోని గాజువాక చుక్కవాని పాలెంలో సంతోష్ బెహరా తన భార్య జయంతి, రెండేళ్ళ కొడుకు రోనిత్ తో కలిసి నివాసముంటున్నాడు. సంతోష్.. గంగవరం పోర్టులో ఉద్యోగి. అయితే.. ఈనెల 11న కొడుకు రోనిత్‌కు, ఆ మరుసటి రోజు భార్య జయంతి పుట్టినరోజు. గతేడాది కొవిడ్ కారణంగా గారాలపట్టి రోనిత్ ఫస్ట్ బర్త్‌డేను జరుపుకోలేకపోయిన ఈ దంపతులు.. ఈ సారి రెండో బర్త్‌డే గ్రాండ్‌గా జరుపుకోవాలని అనుకున్నారు.
అయితే, ఇంతలో ఏమైందో ఏమో.. భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కలహాలతో మనస్తాపం చెందిన జయంతి.. కొడుకుతో కలిసి ఆత్మహత్యచేసుకోవాలనుకుంది. తాము నివశిస్తోన్న వ్రిష బద్రి అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్థుపైకెక్కి కిందకు దూకింది. స్పాట్‌లోనే జయంతి మృతిచెందగా.. కొన ఊపిరితో ఉన్న రెండేళ్ళ రోనిత్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు అసలు కారణాన్ని అన్వేషిస్తున్నారు.