AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tv9 Telugu No.1 Website: డిజిటల్ మీడియాలో సత్తా చాటిన టీవీ9 తెలుగు.. నెం.1 స్థానంలో వెబ్‌సైట్

Tv9 Telugu Number 1 Website: టీవీ9.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కేరాఫ్. 24 గంటల వార్తల ప్రసారంతో తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త

Tv9 Telugu No.1 Website: డిజిటల్ మీడియాలో సత్తా చాటిన టీవీ9 తెలుగు.. నెం.1 స్థానంలో వెబ్‌సైట్
Tv9
Shiva Prajapati
| Edited By: Phani CH|

Updated on: Jul 09, 2021 | 1:10 PM

Share

Tv9 Telugu Number 1 Website: టీవీ9.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కేరాఫ్. 24 గంటల వార్తల ప్రసారంతో తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ఒరవడితో ఒక బ్రాండ్‌గా అవతరించింది టీవీ9 తెలుగు. వేగం, ఖచ్చితత్వంతో కూడిన వార్తలను ప్రసారం చేసి కోట్లాదిమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. పల్లే నుంచి పట్టణం వరకు.. న్యూస్ అంటే టీవీ9 అనేలా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా టీవీ9 తెలుగు మరో మైలు రాయిని అధిగమించింది. న్యూస్ ఛానల్ పరంగా టాప్ ప్లేస్‌లో ఉన్న టీవీ9.. తాజాగా డిజిటల్ మీడియా విభాగంలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే అగ్రస్థానానికి చేరింది. డిజిటల్ మీడియా రంగంలో దశాబ్ధాల ప్రస్థానం కలిగిన హేమాహేమీలను వెనక్కి నెట్టేసింది. టీవీ9 తెలుగు వెబ్‌సైట్.. తెలుగు డిజిటల్ మార్కెట్‌లో నెంబర్ 1 గా అవతరించింది. న్యూస్ వెబ్‌సైట్ల ర్యాంకింగ్స్ ఇచ్చే సంస్థ Comscore Rankings లో టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. మే నెలకు సంబంధించి Comscore Rankings ‌లో 16.54 మిలియన్ల మంది టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌ను సందర్శించారు. ఇది మునుపటి నెలతో పోల్చితో 38 శాతం అధికం.

అచంచలమైన పాఠకుల ఆదరణే ఇందుకు కారణమని టీవీ9 తెలుగు సగర్వంగా ప్రకటిస్తోంది. మెరుగైన సమాజం కోసం నిత్యం తపిస్తున్న టీవీ9 తెలుగు ఛానల్, డిజిటల్ మీడియా వెంటే తెలుగు ప్రజలంతా ఉన్నారని చెప్పడానికి ఇదే తార్కాణం. వార్తలో వాయు వేగం.. అంతకుమించిన ఖచ్చితత్వం.. సమాజంలో ఏళ్ల తరబడి వేళ్లూనుకున్న సమస్యలను ఎటువంటి బెరుకు లేకండా ప్రసారం చేయడం వంటివి టీవీ9 తెలుగును అగ్రస్థానంలో నిలబెట్టాయి. శాస్త్రీయత, సహేతుకతపై రాజీపడని నైజం టీవీ9 తెలుగు సొంతం. ఆ నైజమే టీవీ9 తెలుగు మీడియా రంగంలో మేటిగా నిలబెడుతోంది.

Tv9 Telugu

Tv9 Telugu

కాగా, టీవీ9 తెలుగు నెంబర్ 1 గా నిలవడం పట్ల సంస్థ మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ సంతోషం వ్యక్తం చేశారు. టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌ను నంబర్ 1గా నిలపడంలో భాగమైన ప్రతి వ్యక్తిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాక్షించారు. ‘మెరుగైన సమాజం’ అనే స్లోగన్ మనసులో పెట్టుకుని అలానే ముందుకు వెళ్లాలని సిబ్బందికి సూచించారు. పాత్రికేయ విలువలకు కట్టుబడుతూ డిజిటల్ లోనూ టీవీ9 తెలుగు దూసుకుపోవడం పట్ల హర్షం వ్యక్తంచేశారు.

‘మెరుగైన సమాజమే’ లక్ష్యంగా టీవీ9 తెలుగు చేస్తున్న అక్షర యజ్ఞానికి మద్ధతుగా నిలుస్తున్న పాఠక దేవుళ్లకు టీవీ9 తెలుగు వెబ్‌సైట్ టీమ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ ఆదరణ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాం.

Also read:

Zomato: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జోమాటో కీలక నిర్ణయం.. త్వరలో ఆన్‌లైన్‌ కిరాణ డెలివరీ సేవలు

L Ramana Resign: తెలంగాణలో తెలుగుదేశంపార్టీకి మరో షాక్.. అధ్యక్ష ప‌ద‌వికి ఎల్ ర‌మ‌ణ రాజీనామా..!

IND vs SL: శ్రీలంక టీంలో కరోనా కలకలం.. కోచ్‌కి పాజిటివ్.. సందేహంలో వన్డే సిరీస్?

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..