IND vs SL: శ్రీలంక టీంలో కరోనా కలకలం.. కోచ్‌కి పాజిటివ్.. సందేహంలో వన్డే సిరీస్?
భారత్, శ్రీలంకల మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ అయోమయంలో పడింది. తాజాగా శ్రీలంక జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌కు కోవిడ్ సోకినట్లు తేలింది.
IND vs SL: భారత్, శ్రీలంకల మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ అయోమయంలో పడింది. తాజాగా శ్రీలంక జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌కు కోవిడ్ సోకినట్లు తేలింది. శ్రీలంక టీం ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లి మంగళవారమే స్వదేశానికి తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలోనే బ్యాటింగ్ కోచ్‌కి కరోనా పాజిటివ్ అని తేలడం ఆందోళన కలిగిస్తోంది. బ్యాటింగ్ కోచ్‌తో పాటు ఆటగాళ్లంతా ఒకే విమానంలో తిరిగి రావడంతో టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్‌ను ఐసోలేషన్‌కు పంపించారు. ఆటగాళ్లకు కరోనా పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే, ఎవ్వరికీ పాజిటివ్‌గా తేలలేదు. అయితే ఆటగాళ్లను క్వారంటైన్‌కు పంపించారు. జూలై 13 నుంచి ఇండియా, శ్రీలంకల మధ్య వన్డే సిరీస్ మొదలు కావాల్సి ఉంది. వన్డే సిరీస్ మొదలుకావడానికి ఇంకా నాలుగు రోజులే ఉంది. దీంతో ఈ సిరీస్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అధ్వాన్నంగా శ్రీలంక క్రికెట్.. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటన ముగించుకుని స్వేదేశం చేరుకుంది శ్రీలంక క్రికెట్ జట్టు. అయితే, ఈ పర్యటన ఆ జట్టుకు పీడకలలా తయారైంంది. ఒక్క మ్యాచ్ కూడా శ్రీలంక టీం గెలవలేదు. అలాగే వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయిన లంక టీం, టీ20 సిరీస్‌ను 3-0 తో సమర్పించుకుంది. అలాగే బయో బబుల్ రూల్స పాటించలేదనే కారణంతో లంక జట్టులోని ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు నిరోషన్ డిక్వెల్లా, ధనంజయ్ డి సిల్వా, కుశాల్ మెండీస్ లను వన్డే సిరీస్ నుంచి తప్పించారు. వీరిపై విచారణ కమిటీని నియమిచారు. ఇలా ఇంగ్లండ్ పర్యటనను మాసిపోని మచ్చలా వెంట తెచ్చుకుంది. ఇంగ్లండ్ పర్యటనలో ఆటగాళ్ల తీరుపై మాజీలు సైతం విమర్శలు గుప్పించారు. ఇలా అయితే టీ20 ప్రపంచ కప్‌లో ఘోర పరాజయాలను మూటగట్టుకోవల్సి వస్తుందని హెచ్చరించారు. ఈమేరకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని శ్రీలంక క్రికెట్ ను రిపేర్ చేయాలని కోరుకుంటున్నారు. శ్రీలంక అభిమానులు కూడా ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే, వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న టీమిండియా, శ్రీలంక సిరీస్‌లో ఎలా ఆడతారోనని ఆందోళన చెందుతున్నారు.
Also Read:
ENGW vs INDW: పొట్టి క్రికెట్‌లో సత్తా చాటేనా..! ఇంగ్లండ్‌తో నేటినుంచి టీ20 సిరీస్ ప్రారంభం
Oil Wrestling : మల్లయుద్ధంలో కాసింత తైలాన్ని జోడిస్తే ఆ మజానే వేరబ్బా…!