- Telugu News Photo Gallery Tokyo olympics 2020-21 photos The 23 year old young player is set to make history at the tokyo olympics into the ring as a strong contender for the medal
Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన 23 ఏళ్ల యంగ్ ప్లేయర్.. పతకం కోసం బలమైన పోటీదారుడిగా బరిలోకి..!
2018 కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. టోక్యో ఒలింపిక్‌లో పతకం సాధించే పోరులో చోప్రా కచ్చితంగా ఉంటాడు.
Updated on: Jul 20, 2021 | 11:58 AM

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం సాధించే పోటీదారులలో ప్రముఖంగా వినిపించే పేరు నీరజ్ చోప్రా ఒకరు. జావెలిన్ త్రోయర్ చోప్రా కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించాడు. గత కొన్నేళ్లుగా ఈ ప్లేయర్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు.

అంజు బాబీ జార్జ్ తరువాత ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్థాయిలో అథ్లెటిక్స్‌లో బంగారు పతకం సాధించిన రెండవ భారతీయుడిగా నీరజ్ చోప్రా నిలిచాడు. 2016 సంవత్సరంలో, పోలాండ్‌లో జరిగిన IAAF U20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చోప్రా బంగారు పతకం సాధించాడు. ఈ పతకంతో పాటు జూనియర్ ప్రపంచ రికార్డు కూడా క్రియోట్ చేశాడు.

2020 జనవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన సెంట్రల్ నార్త్ ఈస్ట్ మీటింగ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా పాల్గొన్నాడు. ఇందులో 87.86 మీటర్ల జావెలిన్ విసిరి ఒలింపిక్ బెంచ్ మార్క్ 85 మీటర్లను దాటి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.

కాగా, నీరజ్ చోప్రాకు 2019 సంవత్సరం చాలా కష్టాలను తెచ్చి పెట్టింది. భుజం గాయంతో చాలా రోజులు ఇబ్బంది పడ్డాడు. అనంతరం ఫిట్‌నెస్ సాధించాడు. కానీ, కరోనా కారణంగా దేశ, విదేశాలలో పోటీలు రద్దు చేశారు. చివరగా పాటియాలాలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ -3 లో ఈ ఏడాది మార్చి మొదటి వారంలో 88.07 తో సరికొత్త జాతీయ రికార్డును సృష్టించాడు.

చివరిసారి రియో ఒలింపిక్స్‌లో జర్మనీకి చెందిన థామస్ రోహ్లెర్ 90.30 మీటర్ల త్రోతో స్వర్ణం సాధించాడు. కెన్యాకు చెందిన జూలియస్ యేగో 88.24 మీ., ట్రినిడాడ్, టొబాగోకు చెందిన కేశోరన్ వాల్కాట్ 85.38 మీ. మీటర్ త్రోతో కాంస్య పతకం సాధించాడు. నీరజ్ చోప్రా సాధించిన జాతీయ రికార్డు రియోఒలపింక్స్లో రజత పతక సాధించిన కేశోరన్ వాల్యాట్ తో సమానం గా ఉంది.




