భారత మహిళా క్రికెటర్లలో కొంతమంది ఇప్పటికే బిగ్ బాష్ లీగ్‌లో ఆడారు. వీరిలో స్మృతి మంధన, హర్మన్‌ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి ఉన్నారు. వేద కృష్ణమూర్తి 2017 లో హోబర్ట్ హరికేన్స్ తరఫున ఆడగా, స్మృతి మంధనా 2016 లో బ్రిస్బేన్ హీట్, 2018 లో హోబర్ట్ హరికేన్స్ తరఫున ఆడింది. ఈ టోర్నమెంట్‌లో ఆడిన తొలి భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్. ఆమె 2016, 2017 లో సిడ్నీ థండర్ టీం తరపున బరిలోకి దిగింది.