- Telugu News Photo Gallery Cricket photos India vs srilanka teamindia palyers parctice match in colombo bcci shares match photos
India vs Srilanka: యువ ఆటగాళ్లకు కీలకం.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సత్తా చాటుతోన్న ప్లేయర్స్!
భారత్, శ్రీలంకల మధ్య కొద్ది రోజుల్లో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ సిరీస్‌లో రాణించేందుకు భారత ఆటగాళ్లు.. ప్రాక్టీస్ మ్యాచ్‌లతో దుమ్మురేపుతున్నారు.
Updated on: Jul 08, 2021 | 12:32 PM

ఒకవైపు భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా ఉంది. ఈమేరకు బీసీసీఐ యువ జట్టును శ్రీలంకకు పంపించింది. ఈ పర్యటనలో చేతన్ సకారియా, దేవదత్ పడికల్, అర్ష్దీప్ సింగ్ లకు తొలిసారి జట్టులో అవకాశం లభించింది. ఇషాన్ కిషన్, సూర్య కుమార్ లాంటి ఆటగాళ్లు కూడా తమ రెండవ సిరీస్ లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

శ్రీలంక పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ కొలంబోలోని ఆర్.సి. ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్డేడియంలో జరగనున్నాయి. మొదటి వన్డే జులై 13న ప్రారంభం కానుంది. జులై 16 న రెండో వన్డే, జులై 18న చివరి వన్డే జరగనుంది. అనంతరం టీ20 సిరీస్ మొదలుకానుంది. మొదటి టీ20 జులై 21 న జరగనుంది. జులై 23న రెండవ టీ 20, జులై 25న చివరి టీ20 జరగనుంది.

రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో టీమిండియా ఆటగాళ్లు రెండు టీంలు గా విడిపోయి ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. సీనియర్ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పటికీ, గుర్తించుకోదగిన ప్రదర్శన ఇవ్వలేదు. దాంతో శ్రీలంకలోనైనా సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆస్ట్రేలియా సిరీస్‌లో పేలవమైన ఫామ్ కారణంగా జట్టు నుంచి దూరమైన పృథ్వీ షా.. ప్రస్తుతం అద్భుత ఫాంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో ఈ ఆటగాడు శిఖర్ తో కలిసి మంచి ఆరంభాలను అందించాడు. ఇదే ఫాంను శ్రీలంకలోనూ ప్రదర్శిస్తే... టీమిండియాలో చోటు పదిలమైనట్లే.

చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన రుతురాజ్ గైక్వాడ్.. ఐపీఎల్ లో మంచి ప్రదర్శనతో శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యాడు. ఇక్కడ కూడా అద్భుతంగా రాణిస్తే.. టీమిండియాలో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని ఆరాటపడుతున్నాడు.




