- Telugu News Photo Gallery Cricket photos Kohli and chetan sharma clash over opener abhimanyu ishwaran
Abhimanyu Easwaran: ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ విషయంలో కోహ్లీ, చేతన్ శర్మల మధ్య విభేదాలు.. భారత క్రికెట్‌లో ఇలాంటివి ఎన్నో..!
చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ కమిటీకి, టీమిండియా కెప్టెన్ ల మధ్య బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ విషయంలో తేడాలు వచ్చాయి.
Updated on: Jul 07, 2021 | 10:11 PM

చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ కమిటీకి, టీమిండియా కెప్టెన్ ల మధ్య బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ విషయంలో తేడాలు వచ్చాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా జట్టు యాజమాన్యం, శుభ్‌మన్ గిల్ గాయపడిన తరువాత పృథ్వీ షాతో పాటు దేవదత్ పడికల్ ను ఇంగ్లండ్ పంపాలని కోరుకుంటున్నారు. కానీ, సెలక్షన్ కమిటీ వారి కోరికను తిరస్కరించింది. ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు భారత్‌కు తగినంత ఆటగాళ్లు ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, ఈశ్వరన్ ఓపెనింగ్‌కు సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. కానీ, జట్టు యాజమాన్యానికి బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ మీద నమ్మకం లేదు. ఇలాంటి ఘటనలు భారత క్రికెట్ చరిత్రలో చాలానే ఉన్నాయి.

బెంగాల్ మాజీ కెప్టెన్ సంబరన్ బెనర్జీ మాట్లాడుతూ.. 1979 లో సురిందర్ ఖన్నాతో కలిసి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉందని, అయితే చివరికి తమిళనాడుకు చెందిన భరత్ రెడ్డిని ఎంపిక చేశారని తెలిపాడు. అప్పటి కెప్టెన్ ఎస్. వెంకటరాఘవన్ కూడా తమిళనాడుకు చెందినవాడేనని, అందుకే ఇలాచేశాడని వాపోయాడు. అదేవిధంగా, 1986 ఇంగ్లాండ్ పర్యటనలో కపిల్ దేవ్ ఇంగ్లాండ్‌లో క్లబ్ క్రికెట్ ఆడుతున్న మనోజ్ ప్రభాకర్ బదులు మదన్ లాల్‌ను జట్టులోకి ఆహ్వానించాడు.

కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్,కోచ్ సందీప్ పాటిల్ 1996 లో సౌరవ్ గంగూలీని ఇంగ్లాండ్ తీసుకెళ్లడానికి ఇష్టపడలేదు. కానీ అప్పటి సెలెక్టర్ సంబరన్ బెనర్జీ.. అప్పటి ఎంపిక కమిటీ ఛైర్మన్ గుండప్ప విశ్వనాథ్ తోపాటు కిషన్ రుంగ్తాను ఒప్పించడంలో విజయవంతమయ్యాడు. అలాగే సహారా కప్ 1997 సందర్భంగా, కెప్టెన్ సచిన్ టెండూల్కర్, టీం మేనేజ్‌మెంట్.. మధ్యప్రదేశ్ ఆల్ రౌండర్ జై ప్రకాష్ యాదవ్‌ను జట్టులోకి కోరుకున్నాడు. అయితే సెలక్షన్ కమిటీ కన్వీనర్ జ్యోతి వాజ్‌పేయి మాత్రం జ్యోతి ప్రకాష్ యాదవ్‌ను పంపించాడు.

1997 వెస్టిండీస్ పర్యటనలో టెండూల్కర్ తనకు నచ్చిన ఆఫ్ స్పిన్నర్ దొరకలేదు. అప్పుడు హైదరాబాద్‌కు చెందిన ఒక సెలెక్టర్ నోయెల్ డేవిడ్‌ను ఎంపిక చేయాలని పట్టుబట్టాడు. అతని కెరీర్ నాలుగు వన్డేలకు మాత్రమే పరిమితం అయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చారిత్రాత్మక 2001 సిరీస్‌లో, శరణ్‌దీప్ సింగ్‌ను జట్టులో ఉంచాలని సెలెక్టర్లు కోరుకున్నారు. అందుకు గంగూలీ అంగీకరించలేదు. గంగూలీ.. హర్భజన్ సింగ్‌ను జట్టులో చేర్చుకున్నాడు.

2011 లో ధోనీ.. తన స్నేహితుడు రుద్ర ప్రతాప్ సింగ్‌ను టెస్ట్ జట్టులో అవకాశమిచ్చాడు. ఆర్‌పీ సింగ్ అనుకున్నంతగా రాణించలేదు. ఆ తర్వాత మళ్లీ టెస్ట్ మ్యాచ్‌లు ఆడలేదు.




