బిగ్ బాష్ లీగ్ 2020-21లో అలెక్స్ అత్యధిక పరుగులు చేశాడు. అతను 161.60 స్ట్రైక్ రేట్‌తో 15 మ్యాచ్‌లలో 38.78 సగటుతో 543 పరుగులు చేశాడు. అదే సమయంలో, పాకిస్తాన్ సూపర్ లీగ్ 2020లో, తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 148.63 స్ట్రైక్ రేట్‌తో 271 పరుగులు చేశాడు. అలెక్స్ హేల్స్ టి 20 క్రికెట్‌లో ఐదు సెంచరీలు సాధించాడు. ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు సాధించిన రికార్డును సొంతం చేసుకున్నారు.