రోహిత్ శర్మ ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ తరఫున ఓపెనింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకు ముందు, ఇంగ్లాండ్‌లో రోహిత్ శర్మ పలు రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం, ఈ రోజున, 2019 ప్రపంచ కప్‌లో హిట్‌మ్యాన్ ఐదు సెంచరీలు బాదాడు. ఒక ప్రపంచ కప్‌లో ఐదు సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మన్ గా అవతరించాడు. ఒక ప్రపంచ కప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన లిస్టులో కుమార్ సంగక్కర (నాలుగు సెంచరీలు) రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. అలాగే ప్రపంచ కప్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ సాధించిన అత్యధిక సెంచరీలను (6) సమం చేశాడు. నాలుగు ప్రపంచ కప్‌లల్లో సచిన్ ఈ ఘనత సాధిస్తే.. రోహిత్ కేవలం రెండు ప్రపంచ కప్‌లల్లోనే ఆరు సెంచరీలు బాదేశాడు. ఇంగ్లాండ్‌లో 2019 లో జరిగిన ప్రపంచ కప్‌కి ముందు ఆస్ట్రేలియాలో జరిగిన 2015 ప్రపంచ కప్‌లో ఓ సెంచరీ నమోదు చేశాడు.