- Telugu News Photo Gallery Cricket photos Abhimanyu easwaran controversy indian team management not happy with bengal captain here is the update
రాహుల్ ద్రావిడ్ కోచింగ్.. 20 సెంచరీల మోత.. అయినా విరాట్ కోహ్లీకి నచ్చలేదు.. తుది జట్టులో నో ఛాన్స్.!
Abhimanyu Easwaran: ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో.. అతడి స్థానంలో ఎవరిని తీసుకోవాలన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.
Updated on: Jul 09, 2021 | 12:42 PM

ఆగష్టు 4వ తేదీ నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమిండియా ముమ్మర కసరత్తులు చేస్తోంది. అయితే ఈలోపే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో.. అతడి స్థానంలో ఎవరిని తీసుకోవాలన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ అంశంపై అటు టీం మేనేజ్‌మెంట్‌కు.. ఇటు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

గిల్ స్థానంలో పృథ్వీ షా, దేవదూత్ పడిక్కల్‌ను పంపాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి అడగగా.. ఇప్పటికే రిజర్వ్ ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ జట్టులో ఉన్నారని చీఫ్ సెలెక్టర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

అటు టీం మేనేజ్‌మెంట్ ఈశ్వరన్ సామర్ధ్యంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇంగ్లాండ్‌తో ఆడేందుకు సిద్దంగా లేడని.. బ్యాటింగ్ టెక్నిక్ సరిగ్గా లేదని విమర్శిస్తోంది.

పీటీఐ వార్తల ప్రకారం, అభిమన్యు ఈశ్వరన్ టెక్నిక్‌పై టీమ్ మేనేజ్‌మెంట్‌కు నమ్మకం లేదు. ఈ బ్యాట్స్‌మెన్‌కు ఇంగ్లాండ్‌తో ఆడే సామర్ధ్యం లేదని విమర్శిస్తోంది. ట్రైనింగ్ సమయంలో టీమ్ ఇండియా త్రోడౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్రను కూడా ఎదుర్కోలేకపోతున్నాడని టీం మేనేజ్‌మెంట్ చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ కారణంగానే అతను టెస్ట్ క్రికెట్‌కు ఇంకా సిద్ధంగా లేడని... పృథ్వీ షా, దేవదూత్ పడిక్కల్‌లను ఎంపిక చేయాలని అడుగుతున్నారు. అయితే చీఫ్ సెలెక్టర్ మాత్రం వారి అభ్యర్ధనను తిరస్కరించాడు. జట్టులో మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్‌లు ఉండగా.. మరొకరు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

డొమెస్టిక్ క్రికెట్‌లో అభిమన్యు ఈశ్వరన్ 20 సెంచరీలు చేశాడు. ఫస్ట్ క్లాస్‌లో 13, లిస్టు ఏలో 6, టీ20ల్లో ఒక సెంచరీ బాదాడు. బెంగాల్ టీంకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ 25 ఏళ్ల ప్లేయర్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 43.57 సగటుతో 4401 పరుగులు చేశాడు. లిస్ట్ ఎలో 48.72 సగటుతో 2875 పరుగులు, టి 20 ల్లో 471 పరుగులు 33.64 సగటుతో సాధించాడు.

రంజీ ట్రోఫీ చివరి సీజన్‌లో బెంగాల్ జట్టు ఈశ్వరన్ సారధ్యంలోనే ఫైనల్‌కు చేరింది. లాంగ్ ఫార్మాట్లలో చక్కటి ఇన్నింగ్స్ అడగలడు అని ఈశ్వరన్‌ను మంచి పేరు ఉంది. 2-3 సంవత్సరాలుగా అతడి పేరు వార్తల్లో నిలుస్తోంది.

టీమిండియా లెజెండరీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్న ఈశ్వరన్ 2018-19 రంజీ సీజన్‌లో బెంగాల్ తరఫున అత్యధిక పరుగులు చేశాడు. కేవలం 6 మ్యాచ్‌ల్లో 861 పరుగులు చేశాడు. 95 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో మూడు సెంచరీలు బాదాడు. ఇంతటి రికార్డు ఉన్న ఈశ్వరన్‌పై విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, మిగిలిన మేనేజ్‌మెంట్ విమర్శలు గుప్పిస్తున్నట్లు సమాచారం.




