Oil Wrestling : మల్లయుద్ధంలో కాసింత తైలాన్ని జోడిస్తే ఆ మజానే వేరబ్బా…!

మల్లయుద్ధంలోనే మజా ఉంటుంది. అందుకేగా దంగల్‌ సినిమా అన్నేసి కోట్లు కలెక్ట్‌ చేసింది. ఆ మల్లయుద్ధపు పోటీల్లోనే కాసింత తైలాన్ని జోడిస్తే ఇంకా రసవత్తరంగా ఉంటుంది కదా!

Oil Wrestling : మల్లయుద్ధంలో కాసింత తైలాన్ని జోడిస్తే  ఆ మజానే వేరబ్బా...!
Oil Wrestling
Follow us

| Edited By: Phani CH

Updated on: Jul 09, 2021 | 10:36 AM

మల్లయుద్ధంలోనే మజా ఉంటుంది. అందుకేగా దంగల్‌ సినిమా అన్నేసి కోట్లు కలెక్ట్‌ చేసింది. ఆ మల్లయుద్ధపు పోటీల్లోనే కాసింత తైలాన్ని జోడిస్తే ఇంకా రసవత్తరంగా ఉంటుంది కదా! ఈ ఐడియా టర్కీ వాసులకు ఏనాడో వచ్చింది.. శతాబ్దాలుగా అక్కడ ఆయిల్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది జులై మొదటివారం టర్కీలో కిర్క్‌పినార్‌ అనే ఓ క్రీడా వేడుక జరుగుతుంది.. ఈ ఏడాది జులై 9న మొదలయ్యి జులై 11న ముగుస్తుందీ క్రీడా వేడుక. క్రీడా వేడుక ఎందుకనాల్సి వచ్చిందంటే అందులో క్రీడ ఉంటుంది.. ప్లస్‌ వేడుకా ఉంటుంది.. టర్కీలోని ఎడిర్నే స్టేడియంలో జరిగే ఆయిల్‌ రెజ్లింగ్‌ పోటీలకు బ్రహ్మండమైన చరిత్ర ఉంది.. ఈ మల్లయుద్ధ పోటీలు బహు విచిత్రంగా ఉంటాయి.. దీన్ని గ్రీజు రెజ్లింగ్‌ అని కూడా అంటారు.. అన్నట్టు ఇది టర్కీ జాతీయ క్రీడ.. పోటీలో పాల్గొనే మల్లయుద్ధ వీరులంతా తమ ఒంటికి ఒలివ్‌ ఆయిల్‌ను దట్టంగా పూసుకుంటారు. అప్పుడు కానీ బరిలో దిగరు..

ఇతరదేశాల్లో నివసించే టర్కిష్‌ వాళ్లంతా ఈ ఆయిల్‌ రెజ్లింగ్‌ పోటీలను నిర్వహించుకుంటారు కానీ.. టర్నీలోని ఎడిర్నే పోటీల్లోనే ఉంటుంది అసలు మజా! ఇందులో పాల్గొనే మల్ల యోధులను పహిల్వాన్‌ అని రుస్తుం అని అంటారు.. అంటే హీరో అన్నమాట! చేత్తో కుట్టిన ఓ పెద్ద నిక్కరు వేసుకుంటారు. దున్న చర్మంతో ఈ నిక్కరును రూపొందించడం సంప్రదాయమే కానీ.. ఇప్పుడు మాత్రం దూడ చర్మంతో కుట్టిన ఓ పొడవాటి నిక్కర్లను ధరిస్తున్నారు. వీటిని కిస్బెట్‌ అంటారు. కొన్ని ప్రాంతాలలో కిస్పెట్‌ అని కూడా పిలుస్తారు. ఒలింపిక్‌ రెజ్లింగ్‌ పోటీల్లాగా తెగ పట్లు పట్టేసుకోరు.. ఎంత లాఘవంగా ప్రత్యర్థి కిస్బెట్‌ను పట్టుకుంటారో వాడే విజేత ఇందులో! అందుకే బరిలో దిగిన యోధులిద్దరూ అప్రమత్తంగా ఉంటారు.. అవతలి వ్యక్తి చేతులను తమ కిస్బెట్‌ వరకు రాకుండా చూసుకుంటారు.. ప్రతిఘటిస్తారు.. గెలుపొందడానికి అవసరమయ్యే ఎత్తుగడను పాకా కజిక్‌ అంటారు.. పాకా కజిక్‌ను అమలు చేసిన వ్యక్తి విజేత అవుతాడన్నమాట!

పాత రోజుల్లో అయితే ఈ పోటీకి నిర్ణీత కాలపరిమితి ఉండేది కాదు.. రోజంతా కుస్తీ పడుతూనే ఉండేవారు.. కొన్ని సందర్భాలలో రెండు రోజులు కొనసాగేది..విజేతను నిర్ణయించడం బహు కష్టంగా ఉండేది.. సమ ఉజ్జీలు తలపడితే ఇలాగే ఉంటుంది.. ఇలాగైతే లాభం లేదనుకున్న నిర్వాహకులు సమయాన్ని బాగా కుదించారు. 1975 నుంచి అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం అర్హత పోటీలకు 40 నిమిషాలు…పహిల్వాన్‌ పోటీలకు 30 నిమిషాలను కేటాయించారు. అప్పటికీ ప్రత్యర్థులిద్దరూ కుస్తీలు పడుతూనే ఉన్నారనుకోండి.. మరో పావుగంట అదనపు సమయాన్ని ఇస్తారు. ఈ ఆయిల్‌ రెజ్లింగ్‌ పోటీలకు సంవత్సరాల చరిత్ర ఉంది.. 1362 నుంచి ఎడిర్నేలో పోటీలు జరుగుతున్నాయి. నెమ్మదిగా ఈ వింత మల్లయుద్ధ పోటీలు ఇతర దేశాలకు విస్తరించాయి. గ్రీసులోని కొన్ని ప్రాంతాలలో…నెదర్లాండ్స్‌.. జపాన్‌ దేశాలలో ఆయిల్‌ రెజ్లింగ్‌ పోటీలు జరుగుతున్నాయి.

మళ్లీ టర్నీలో జరిగే పోటీల విషయానికి వద్దాం.. విజేతకు నగదు బహమతులు.. సత్కారాలు వంటివి ఉన్నా.. పోటీలో పాల్గొనేవారు మాత్రం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించరు. పైగా పరస్పరం గౌరవించుకుంటారు.. ఉదాహరణకు వయసులో తనకంటే పెద్ద అయిన వ్యక్తిని ఒకరు ఓడించారే అనుకుందాం! గెలిచిన వ్యక్తి ఓడిన వ్యక్తి చేతిని ఆప్యాయంగా ముద్దాడుతాడు.. దీవెనలను అందుకుంటాడు. టర్కీలో అక్కడక్కడ ఏడాది పొడవునా ఆయిల్‌ రెజ్లింగ్‌ పోటీలు జరుగుతాయి కానీ.. జులై మొదటివారంలో జరిగే పోటీలే అసలు సిసలైన పోటీలు. ఇందులో పాల్గొనేందుకు ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో వస్తారు.. ఇక వీటిని తిలకించడానికి వచ్చేవారితో స్టేడియం కిక్కిరిసిపోతుంది.. ఇసుకేస్తే రాలనంతగా జనం వస్తారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఆసక్తే! అందుకే ఇన్నేళ్లయినా ఆ సంప్రదాయం పదిలంగా నిలుస్తూ వస్తోంది..

మరిన్ని ఇక్కడ చూడండి: Amazon Prime Day: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్స్‌ వచ్చేసింది.. ఎప్పటి నుంచి అంటే..!

Atrocities: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. ట్రైన్‌లో నుండి పడిపోయిన ఆరేళ్ల పాప.. కొన ఉపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి!

ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..