AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Prime Day: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్స్‌ వచ్చేసింది.. ఎప్పటి నుంచి అంటే..!

Amazon Prime Day: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. ప్రైమ్ డే సేల్స్ ఎప్పుడు అనేది తెలిసిపోయింది. భారత్‌ వ్యాప్తంగా 2021 జులై 26 నుంచి జులై 27వరకూ రెండు రోజుల పాటు..

Amazon Prime Day: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్స్‌ వచ్చేసింది.. ఎప్పటి నుంచి అంటే..!
Amazon Prime Day-2021
Subhash Goud
|

Updated on: Jul 09, 2021 | 10:22 AM

Share

Amazon Prime Day: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. ప్రైమ్ డే సేల్స్ ఎప్పుడు అనేది తెలిసిపోయింది. భారత్‌ వ్యాప్తంగా 2021 జులై 26 నుంచి జులై 27వరకూ రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జూలై 26 అర్ధరాత్రి నుంచి స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, టీవీలు లాంటి పలు కేటగిరీల్లో అమ్మకాలు జరగనున్నాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు డీల్స్, లాంచెస్ ముందుగా అందుబాటులో ఉండనున్నాయి. ప్రతి ఏడాది పాటు సబ్‌స్క్రి ప్షన్ రూ.999, మూడు నెలల సబ్‌స్క్రి ప్షన్‌కు రూ.329కి లభిస్తుంది. ఉచిత డెలివరీతో పాటు, అన్‌లిమిటెడ్ వీడియో, యాడ్ ఫ్రీ మ్యూజిక్, ఎక్స్‌క్లూజివ్ డీల్స్, ఫ్రీ ఇన్ గేమ్ లాంటి సర్వీసులు వాడుకోవచ్చు.

అంతేకాకుండా కొత్తగా అమెజాన్ అకౌంట్ తీసుకుంటే.. వెయ్యి రూపాయల వరకూ క్యాష్ బ్యాక్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ప్రైమ్ మెంబర్లు ప్రైమ్ డే రోజున ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో జరిపితే అన్‌లిమిటెడ్‌గా 5 శాతం రివార్డు పాయింట్లు అందనున్నాయి.

అయితే ఈ ప్రైమ్‌ డే సేల్‌ ను మొదట జూన్‌ నెలలో నిర్వహించాలని భావించినా, కోవిడ్‌ కారణంగా ప్రైమ్‌ డే సేల్‌ వాయిదా పడింది. కోవిడ్‌-19 కారణంగా నష్టపోయిన వ్యాపారులకు ప్రైమ్‌ డే సేల్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని అమెజాన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో అమెజాన్‌ ప్రైమ్‌ ఐదో వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ప్రైమ్‌ డే సేల్‌లో బ్లాక్‌బస్లర్‌ డీల్స్‌తో పాటు, భారీ డిస్కౌంట్లను, సూపర్‌ సేవింగ్‌ డీల్స్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుంగా సుమారు 300కి పైగా కొత్త ఉత్పత్తులను లాంచ్‌ చేయనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. కాగా జూలై 8 నుంచి జూలై 24 వరకు అమ్మకందారులతో అమెజాన్‌ ఒప్పందాలను కుదుర్చుకోనుంది.

ఈ సేల్‌ ద్వారా కస్టమర్లు ఎంతో బెటిఫిట్స్‌ పొందే అవకాశం లభిస్తుంది. స్మార్ట్‌ ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ తదితర వస్తువులను విడుదల చేయడమే కాకుండా వాటిపై భారీ ఆఫర్లను ప్రకటించనుంది అమెజాన్‌. ఈ ప్రైమ్‌ డే సేల్‌ లక్షలాది స్థానిక వ్యాపారులకు లాక్‌డౌన్‌ నుంచి ఉపశమనం లభిస్తుందని అమెజాన్‌ ఇండియా హెడ్‌ అమిత్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

ఇవీ కూడా చదవండి

OnePlus Nord 2: వన్‌ప్లస్‌ నుంచి మరో కొత్త మొబైల్‌.. లీకైన విడుదల తేదీ.. స్పెసిఫికేషన్లు..!

Maruti Suzuki: మారుతి సుజుకీ అదిరిపోయే ఆఫర్‌.. పలు మోడళ్ల కార్లపై భారీగా తగ్గింపు.. పూర్తి వివరాలు..!

Google Maps: విదేశీ పర్యాటకులకు చుక్కలు చూపించిన గూగుల్‌ మ్యాప్‌.. అసలేం జరిగిందంటే..!