Google Maps: విదేశీ పర్యాటకులకు చుక్కలు చూపించిన గూగుల్ మ్యాప్.. అసలేం జరిగిందంటే..!
Google Maps: భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే ప్రపంచ గూగుల్ చుట్టు తిరుగుతోంది. ఏ చిన్న పని ఉన్నా ఈ సెర్చ్ ఇంజన్‌ను నమ్ముకోవాల్సిందే. ప్రతి ఒక్కరు గూగుల్..
Google Maps: భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే ప్రపంచ గూగుల్ చుట్టు తిరుగుతోంది. ఏ చిన్న పని ఉన్నా ఈ సెర్చ్ ఇంజన్‌ను నమ్ముకోవాల్సిందే. ప్రతి ఒక్కరు గూగుల్ మ్యాప్‌లను నమ్ముకుని ఉంటారు. ముఖ్యంగా ప్రయాణ సమయంలో దారి చూపే దేవతగా గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుంటారు. అయితే గూగుల్ మ్యాప్‌ను నమ్ముకున్న ప్రయాణికుల చుక్కలు కనిపించాయి. వారి ప్రయాణాన్ని బురదలో దించుకున్న పర్యాటకుల గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జర్మనీ, ఉత్తరాఖండ్‌కు చెందిన కొందరు పర్యాటకులు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు బయలుదేరారు. తమ గ్రాండ్ ఐ10 వాహనంలో నవానియా హైవేపై వీరి ప్రయాణం సజావుగా కొనసాగుతుండగా, గూగుల్ మ్యాప్ ఒక దగ్గరి దారిని చూపించింది. ఇంకేముంది వారు గూగుల్ మ్యాప్ చూపించిన దారి దగ్గరవుతుందని, సమయం కూడా అదా అవుతుందని ఈ దగ్గరి దారిని ఎంచుకున్నారు. హైవేపై నుంచి టర్నింగ్ తీసుకున్న వీరి కారు కొంతదూరం సజావుగానే వెళ్లింది. ఆ తరువాత అసలు సినిమా మొదలైంది.
సింగిల్‌లైన్ రహదారి అయిన ఈ మార్గంలో పూర్తిగా బురదతో నిండి ఉండడమే వీరికి నరకం కనిపించింది. అంతేకాదు వాహనం బురదలో కూరుకుపోవడంతో వీరి ప్రయాణం నరకంగా మారింది. చివరకు ఒకచోట వీరి కారు పూర్తిగా బురదలో చిక్కుకుంది. పైగా వాహనం ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. దీంతో పర్యాటకులందరూ కారు దిగి ,దాన్ని కదిలించడానికి ముందుకు తోశారు. కానీ ఉపయోగం లేకపోయింది. దీంతో తమ స్నేహితులను సహాయం చేయడానికి రావాల్సిందిగా కోరారు. కారు చిక్కుకున్న దారి అధ్వాన్నంగా ఉంది. స్థానికులు కూడా ఈ మార్గాన్ని వాడరని తెలిసింది. గతంలో ఓ మాదిరి భారీ వాహనాలు కూడా ఇక్కడ బురదలో చిక్కుకుపోయాయని స్థానికలు తెలిపారు. ఇక కారును బయటకు తీయడం అంత సులభం కాదనుకున్న పర్యాటకుల బృందం తమ స్నేహితులకు ఫోన్ చేయడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే వాహనాన్ని బయటకు లాగడానికి ట్రాక్టర్‌ను తీసుకురావాల్సి వచ్చింది. ఆ ట్రాక్టర్ కోసం తాము ఎంతో దూరం నడుచుకుంటూ వెళ్లినట్లు యాత్రికులు బాధను వెళ్లబోసుకున్నారు.
ఆ తర్వాత ట్రాక్టర్ సహాయంతో ఎట్టకేలకు వారి వాహనం బురదలోంచి బయటకు తీయగలిగారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బురదలో చిక్కుకున్న కారు.. సాయంత్రం ఆరు గంటలకు బయటకు వచ్చింది. ఈ సంఘటన గురించిన నివేదికను ఇండియా ఆటో న్యూస్ పోర్టల్ కార్టోక్ ప్రచురించింది. గూగూల్‌ను గుడ్డిగా నమ్మకూడదని ఈ ఘటననే నిదర్శనం.