International Kissing Day 2021: ఆరోగ్యానికి ముద్దు ఎంతో మంచిది.. ముద్దుతో ఉన్న ప్రయోజనాలు ఏంటో తెలిస్తే..

International Kissing Day 2021: ఆరోగ్యానికి ముద్దు ఎంతో మంచిది.. ముద్దుతో ఉన్న ప్రయోజనాలు ఏంటో తెలిస్తే..
International Kissing Day 2021

International Kissing Day 2021: ఈ ప్రకృతిలో ప్రేమను చాటుకోవడానికి ఉన్న ఏకైక సాధనం ముద్దునే. ముద్దుతో మొదలై హగ్గుకు దారితీసి ఆ తర్వాత ఎంతో దూరం వెళ్లిపోయేలా చేస్తుంది..

Subhash Goud

|

Jul 06, 2021 | 11:18 AM

International Kissing Day 2021: ఈ ప్రకృతిలో ప్రేమను చాటుకోవడానికి ఉన్న ఏకైక సాధనం ముద్దునే. ముద్దుతో మొదలై హగ్గుకు దారితీసి ఆ తర్వాత ఎంతో దూరం వెళ్లిపోయేలా చేస్తుంది ముద్దు. అదంతా ముద్దు నుంచి పుట్టే తతంగమే.. ఆ ప్రేమ లేనిదే అసలు ప్రపంచమే లేదు. అందుకే ప్రేమలో ‘ముద్దు’కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఆ ముద్దు వెనుక ఉండే మాధుర్యమే వేరు. కరోనా మహమ్మారి గత ఏడాది నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ఓ షేక్ హ్యాండ్ లేదు.. హగ్ లేదు.. ఇక ముద్దూ మురిపాలు కూడా లేకుండా పోయాయి. భౌతిక దూరం పాటిస్తూ జనాలు నెట్టుకొస్తున్నారు. ఇక జూలై 6న ‘వరల్డ్‌ కిస్సింగ్‌ డే’. ఈ ముద్దు వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి.

► అయితే ముద్దు మురిపాలపై మన టాలీవుడ్ లో ఎన్నో పాటలున్నాయి. అంతేకాదండోయ్.. ఈ అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం అమెరికాలో జూన్ 22న జాతీయ ముద్దుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటారు. అమెరికాలో మొదలైన ఈ సంస్కృతి ప్రపంచదేశాలకు పాకింది. ప్రేమికులకు ముఖ్యంగా ఈరోజు ఒక మధురానుభూతి. ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే జూలై 6న జరుపుతారు. అయితే అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం బ్రిటన్ దేశంలో మొదలైంది. ప్రపంచం మొత్తం పాకింది. అమెరికాలో మాత్రం జూన్ 22న జరుపుకొంటారు. ఈరోజు అమెరికన్లు తమ తనివితీరా ముద్దులు పెట్టుకుంటారు.

► ముద్దుల చరిత్రను ఒక్కసారి చూస్తే ఆశ్చర్యపోయే విషయాలు బయటపడతాయి. మొట్టమొదట క్రీ.పూర్వం 1500 కాలం నుంచి ఈ ముద్దులు పెట్టుకోవడం ఉందట.. మొట్టమొదట క్రీస్తు పూర్వం 326లో ది గ్రేట్ అలెగ్జాండర్ కాలం నుంచి ఈ ముద్దుల పరంపరం ఉందని కథనాలు ఉన్నాయి. రోమన్లు ముద్దులంటే పడిచచ్చేవారట.

► అదంతా పక్కనపెడితే ముద్దులపై చేసే అధ్యయనాల శాస్త్రం పేరు ‘ఫిలెమాటోలజీ’ అంటారు. ఈ అధ్యయనాల ప్రకారం.. ముద్దులతోనే బంధం ప్రేమ బలపడుతుందని.. దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముద్దుల వల్ల అనేక ప్రయోజనాలున్నాయని చాలా అధ్యయనాల్లో తేలింది. ముద్దులు పెట్టుకోవడం వల్ల కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చని వెల్లడైంది.

► ముద్దుతో రోగ నిరోధక శక్తిని పెరుగుతుందని తేలింది. ఒత్తిడి ఆందోళన తలనొప్పిని తగ్గిస్తుందని నిరూపితమైంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలుగుతుందని పరిశోధనలో తేలింది.

► ప్రధానంగా ముద్దు వల్ల ముఖాల కండరాల్లో కదలిక వస్తుందని తేలింది. కేలరీలను కరిగిస్తుందని.. ఆయుష్షును పెంచుతుందని తేలింది.

► ముద్దు పెట్టుకోవడం వల్ల అదనంగా లాలాజలం ఉత్పత్తి చేస్తున్నందున నోటిని శుభ్రపర్చడానికి ఎంతగానో సహాయపడుతుందని చెబుతున్నారు. ముద్దులు దంత క్షయంపై పోరాడడానికి సహాయపడుతుందట.

► ముద్దులు ఒత్తిడి తగ్గించడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు సహాయపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

► సగటున ఒక వ్యక్తి 336 గంటలు ముద్దు పెట్టుకుంటాడు. ఇది మన జీవితంలో రెండు వారాలకు సమానం.

► ఎక్కువగా ముద్దు పెట్టుకునే పెంపుడు జంతువులు.. సుమారు 75 శాతం మంది ప్రజలు తమ పెంపుడు జంతువులను ముద్దు పెట్టుకుంటారని అధ్యయనంలో తేలింది. కానీ 70 శాతం మంది ఉత్తమమైన పెంపుడు జంతువులకు, 21 శాతం మంది తమ పిల్లలను ముద్దు పెట్టుకుంటారని, 7 శాతం తమ పక్షులను, 2 శాతం సరీసృపాలని అధ్యయనంలో తేలింది.

► మీరు మీ భాగస్వామిని ఒక నిమిషం పాటు ముద్దు పెట్టుకుంటే 26 కేలరీలు ఖర్చు అవుతుందని, ముద్దు పెట్టుకోవడం వల్ల ఆయుష్సును పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

► ఆఫ్రికాలో ప్రజలు నడిచే మైదానంలో తరచుగా ముద్దు పెట్టుకుంటారు. ఇటీవల హలో చెప్పడానికి బదులు ప్రజలు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటున్నారట.

► 2010లో ఎలెనా అన్‌డన్‌ పిక్చర్‌లో నటులు నెకర్‌ జేడ్‌గన్‌, ట్రెసీ డిన్విడ్డిలు 3 నిమిషాల 23 సెకన్ల పాటు ముద్దు పెట్టుకుని రికార్డు క్రియేట్‌ చేశారు. కాగా, ప్రపంచంలోనే లాంగెస్ట్‌ కిస్‌ రికార్డు థాయ్‌ కపుల్‌ ఎక్కాచ్‌ అండ్‌ లాక్సానా తిరన్‌ రాథ్‌ పేరు మీద నమోదైంది. వీరు ముద్దు పెట్టుకున్న సమయం 58 గంటల 35 నిమిషాల 58 సెకండ్లు.

ఇవీ కూడా చదవండి:

ఈ ఐదు నెలల పాప కొంచెం కొంచెం రాయిగా మారుతోంది..! 2 మిలియన్ల జనాభాలో ఒకరికి మాత్రమే ఇలా జరుగుతుందట..?

Bone death: కరోనా బాధితుల్లో మరో కొత్త సమస్య.. ఇప్పటి వరకు ముగ్గురిలో గుర్తించామన్న వైద్య నిపుణులు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu