అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేళ..షికాగోలో ప్రజ్వరిల్లిన హింస..కాల్పుల్లో 14 మంది మృతి
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవమైన ఈ నెల 4 న దేశ వ్యాప్తంగా పరేడ్స్, ఫైర్ వర్క్స్, వంటివాటితో సంబరాలు అంబరాన్ని అంటాయి. వీకెండ్ కావడంతో ప్రజల ఆనందోత్సాహాలకు అంతు లేకపోయింది. కానీ షికాగోలో మాత్రం ఆ ఆరోజున హింస ప్రజ్వరిల్లింది. వేర్వేరు చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు...
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవమైన ఈ నెల 4 న దేశ వ్యాప్తంగా పరేడ్స్, ఫైర్ వర్క్స్, వంటివాటితో సంబరాలు అంబరాన్ని అంటాయి. వీకెండ్ కావడంతో ప్రజల ఆనందోత్సాహాలకు అంతు లేకపోయింది. కానీ షికాగోలో మాత్రం ఆ ఆరోజున హింస ప్రజ్వరిల్లింది. వేర్వేరు చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 88 మందిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. గత ఏడాది ఈ నగరంలో 774 మర్దర్లు జరగగా.. ఈ ఇండిపెండెన్స్ డే నాడే ఇంతటి హింస జరగడం గమనార్హం. హింసాత్మక ఘటనలు జరగకుండా మీరు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ఈ నెల 2 వ తేదీనే షికాగో సిటీ కౌన్సిల్ కు చెందిన సభ్యులు సుమారు ఆరు గంటలపాటు పోలీసులను నిలదీశారు. వారి ప్రశ్నలకు డేవిడ్ బ్రౌన్ అనే పోలీసు అధికారి సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. ఇంత జరిగినా ఈ సిటీలో గన్ కల్చర్ విశృంఖలంగా సాగింది. గత సంవత్సరం జులై 4 న ఇదే నగరంలో 87 మందిపై కాల్పులు జరగగా 17 మంది మృతి చెందారు. నాటి ఘటనను దృష్టిలో నుంచుకుని ఈ కౌన్సిల్ సభ్యులు ఇలా ముందే పోలీసులపై ధ్వజమెత్తారు.
కాగా దేశ వ్యాప్తంగా 400 కు పైగ కాల్పుల ఘటనలు జరిగాయని..150 మంది మృతి చెందారని ఓ సంస్థ వెల్లడించింది. నిన్న జరిగిన వేర్వేరు ఘటనల్లో ఐదుగురు చిన్నారులు కూడా గాయపడ్డారు. ఈ గన్ వయొలెన్స్ కి నిరసనగా ఆస్టిన్ లో 21 ఏళ్ళ నుంచి 71 ఏళ్ళ వరకు మహిళలు నగరంలోని ఓ పార్కింగ్ ప్రదేశంలో టెంట్ వేసుకుని నిరాహార దీక్ష చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి :మెడలో నాగుపాము..సైకిల్ పై సవారీ..చుస్తే షాక్ అవుతారు..!వైరల్ అవుతున్న వీడియో..:snake on neck viral video.