USA Cyber Attack: అమెరికాతో స‌హా 17 దేశాల‌పై సైబ‌ర్ అటాక్.. రూ.520 కోట్లు డిమాండ్ చేసిన కేటుగాళ్లు

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Jul 06, 2021 | 6:49 AM

సైబర్ నేరగాళ్లు ఎవరిని వదలడంలేదు. తాజాగా అగ్రరాజ్యం అమెరికాను టార్గట్ చేశారు సైబర్ కేటుగాళ్లు. వరుసగా హ్యాకర్స్ ఆ దేశంపై దాడులు చేస్తూనే ఉన్నారు.

USA Cyber Attack: అమెరికాతో స‌హా 17 దేశాల‌పై సైబ‌ర్ అటాక్.. రూ.520 కోట్లు డిమాండ్ చేసిన కేటుగాళ్లు
Cyber Attack On American It Company

Cyber Attack on American IT company: సైబర్ నేరగాళ్లు ఎవరిని వదలడంలేదు. తాజాగా అగ్రరాజ్యం అమెరికాను టార్గట్ చేశారు సైబర్ కేటుగాళ్లు. వరుసగా హ్యాకర్స్ ఆ దేశంపై దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ర‌ష్యాకు చెందిన హ్యాక‌ర్స్ దాడికి అమెరికా కంపెనీలు హడలిపోతున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజం క‌సేయాపై హ్యాక‌ర్స్ గ్యాంగ్ రాన్సమ్‌వేర్‌తో దాడి చేసింది. దీంతో వందలాది వ్యాపారసంస్థల కార్యక‌లాపాల‌ు స్తంభించిపోయాయి. అమెరికాతో స‌హా మొత్తం 17 దేశాల‌పై ఈ సైబ‌ర్ దాడులు జ‌రిగినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

ర‌ష్యాకు చెందిన సైబర్ దుండగులు అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ఫ్లాన్ చేసింది. ఈవిల్ గ్యాంగ్ ఈ దాడుల‌కు పాల్పడిన‌ట్టు తెలుస్తోంది. ఆయా కంపెనీలలో వినియోగించే వీఎస్ఏ టెక్నాల‌జీపై సైబ‌ర్ నేర‌గాళ్లు రాన్సమ్‌వేర్‌తో దాడులు చేశారు. దీంతో ల‌క్షల సంఖ్యలో కంప్యూట‌ర్లు హ్యాక్ అయ్యాయ‌ని కంపెనీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇప్పటికే స్పందించిన హ్యాకర్లు తమకు రూ. 520 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశార‌ని, ఆ సొమ్ము చెల్లిస్తే బాధితుల ఫైల్స్ డీక్రిప్ట్ అయ్యే విధంగా చూస్తామ‌ని హ్యాక‌ర్స్ ప్రకటించినట్టు సమాచారం. ఈ హ్యాక‌ర్స్ దాడులు చేసిన రెండు రోజుల త‌రువాత నిందితులను గుర్తించగలిగామని సైబర్ క్రైమ్ నిఘా వర్గాలు వెల్లడించాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

సాఫ్ట్ వేర్ ప్రొవైడర్ కసేయాపై దాడి చేయడంతో ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్న కార్పొరేట్ కంపెనీలకు ఈ వైరస్ వేగంగా వ్యాపించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ కసేయాకు అమెరికా, జర్మనీ, యూకే, ఆస్ట్రేలియా, కెనడాతో సహా అనేక దేశాల్లో ఉన్న 200 కంపెనీల డేటాను రాన్ సమ్ వేర్ గ్యాంగ్స్ అటాక్ చేసినట్లు FBI అధికారులు భావిస్తున్నారు. దాడి వెనుక రష్యాతో సంబంధాలున్న రేనమ్స్ వేర్ గ్యాంగ్ ఉందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ గ్యాంగ్ గతంలో కొన్ని మేసెజ్డ్ సర్వీసు ప్రొవైడర్లను సైతం టార్గెట్ చేసినట్లు.. ఈసారి తీవ్రత అంచనాలకు మించి ఉన్నట్లు సైబర్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్‌‌తో జెనివాలో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు పాల్గొన్న సంగతి తెలిసిందే. సైబర్ దాడుల అంశం వీరిద్ధరి మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఈ దాడులను వీలైనంత త్వరగా అరికట్టడానికి తమతో కలిసి పనిచేయాలని ప్రకటించిన కొద్ది రోజులకే ఈ దాడి జరగడంపై అనుమానాలు రేకేత్తిస్తుంది. అయితే, ఈ దాడులు ఇక్కడితో ఆగే పరిస్థితి లేదని అమెరికాకు హెచ్చరికలు అందుతున్నాయి.

Read Also… Bone death: కరోనా బాధితుల్లో మరో కొత్త సమస్య.. ఇప్పటి వరకు ముగ్గురిలో గుర్తించామన్న వైద్య నిపుణులు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu