జిహాదీల ‘దూకుడు’…బాగ్దాద్ లో యూఎస్ ఎంబసీపై ఎగిరిన డ్రోన్ ను కూల్చివేసిన అమెరికా భద్రతా దళాలు..
ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో తమ దేశ ఎంబసీపై ఎగిరిన డ్రోన్ ను అమెరికా భద్రతా దళాలు కూల్చివేశాయి. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో ఎగిరిన ఈ డ్రోన్ లో శక్తిమంతమైన పేలుడు పదార్థాలు ఉన్నట్టు తెలిసింది. అమెరికా సైనికులు రాకెట్లను ప్రయోగించి దీన్ని కూల్చివేశారని ఎంబసీ వర్గాలు తెలిపాయి.
ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో తమ దేశ ఎంబసీపై ఎగిరిన డ్రోన్ ను అమెరికా భద్రతా దళాలు కూల్చివేశాయి. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో ఎగిరిన ఈ డ్రోన్ లో శక్తిమంతమైన పేలుడు పదార్థాలు ఉన్నట్టు తెలిసింది. అమెరికా సైనికులు రాకెట్లను ప్రయోగించి దీన్ని కూల్చివేశారని ఎంబసీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి బాగ్దాద్ లోని అమెరికన్ స్థావరాలపై 47 డ్రోన్ దాడులు జరిగాయని ఏఎఫ్ పీ వార్తా సంస్థ తెలిపింది. ఇరాక్ లో జిహాదీల ఇస్లామిక్ గ్రూప్ ను ఎదుర్కొనేందుకు దాదాపు రెండున్నర వేలమంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారు.జూన్ 9 న కూడా అత్యంత శక్తిమంతమైన పేలుడు పదార్థాలతో కూడిన మూడు డ్రోన్లు అమెరికా దళాలు ఉన్న బాగ్దాద్ ఎయిర్ పోర్టును టార్గెట్ చేశాయి. ఇవి పేలిపోయి ఉంటే భారీగా ఆస్థి, ప్రాణ నష్టం జరిగి ఉండేది. వీటిలో ఒక దానిని ఇరాక్ ఆర్మీ కూల్చివేసింది. బాగ్దాద్ లో తమ ఎయిర్ బేస్ లపై ఈ డ్రోన్ల దాడికి సంబంధించి ముందే సమాచారం ఇచ్చినవారికి 30 లక్షల డాలర్ల రివార్డు ఇస్తామని అమెరికా ఇదివరకే ప్రకటించింది.
నిన్న మూడు రాకెట్లు ఇరాక్ ఎయిర్ బేస్ ని టార్గెట్ చేశాయి. అయితే అవి బేస్ కి దూరంగా పడడంతో ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏమైనా… జిహాదీలను అణచివేసేందుకు అమెరికా శతవిధాలా యత్నిస్తోంది. వారికి కొన్ని దేశాల నుంచి ఆయుధ సహాయం అందుతోందని యూఎస్ భావిస్తోంది. తమ శత్రు దేశాల పన్నాగమే ఇది అమెరికా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:తేలు విషాన్ని చిమ్మడం మీరెప్పుడైనా చూశారా? విషం చిమ్ముతున్న స్లో మోషన్ వైరల్ అవుతున్న వీడియో..:Scorpion video.