Nokia G20: భారత్ మార్కెట్లోకి నోకియా బడ్జెట్ ఫోన్ విడుదల..అదిరిపోయే ఫీచర్స్.. ధర ఎంతంటే..?
Nokia G20 Launch: ప్రముఖ హెచ్‌ఎండీ సంస్థ నోకియా బ్రాండ్ నుంచి కొత్త మోడల్ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. భారత మార్కెట్లోకి Nokia G20 ఫోన్ విడుదల చేసింది..
Nokia G20 Launch: ప్రముఖ హెచ్‌ఎండీ సంస్థ నోకియా బ్రాండ్ నుంచి కొత్త మోడల్ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. భారత మార్కెట్లోకి Nokia G20 ఫోన్ విడుదల చేసింది. అయితే ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సేల్ లిస్టులో ఈ కొత్త ఫోన్ Nokia G20 దర్శనమిచ్చింది. ఫోన్ ధరతో పాటు సేల్ డేట్ కూడా వచ్చేసింది. HMD సంస్థ నుంచి వచ్చే బడ్జెట్ ఫోన్ ఇది.. భారత మార్కెట్లో దీని ధర రూ.13వేల కంటే తక్కువగానే ఉండనుంది.
యూరోపియన్ ధరను భారత కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దాదాపు రూ.14 వేల వరకు ఉంటుంది. జూలై 7న అమెజాన్‌లో Nokia G20 ఫోన్ మార్కెట్లోకి రానుంది. గత ఏప్రిల్ నెలలో HMD సంస్థ ఆరు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో Nokia X20, Nokia X10, Nokia G20, Nokia G10, Nokia C20, Nokia C10 మోడల్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వీటిలో X- సిరీస్ ఫోన్లలో 5G నుంచి ఉన్నాయి. మిగిలినవి 4G ఫోన్లే.. నోకియా 5G ఫోన్లలో X20, X10 రెండు ఉన్నాయి.
Nokia G20 ధర ఎంతంటే?:
నోకియా G20 ఫోన్ ధర రూ.12,999గా ఉండనుంది. బేస్ వేరియంట్ 4GB RAM, 64GB ఇంటర్నల్ మెమెరీ, 128GB స్టోరేజీ వేరియంట్ కూడా ఉండే అవకాశం ఉంది. అమెజాన్ ఫస్ట్ సేల్ జూలై 7 నుంచి అందుబాటులో రానుంది. అలాగే Nokia ఆన్ లైన్ స్టోర్ లోకి అందుబాటులో ఉండనుంది.
6.5-అంగుళాల HD+ డిస్‌ప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియో, మీడియా టెక్ హెలియో G35 ప్రాసెసర్, 4GB RAM + 64GB, 128GB స్టోరేజీ, మైక్రోSD కార్డ్ స్లాట్, 48MP మెయిన్ కెమెరా, 5MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మైక్రో కెమెరా, 2MP డెప్త్ సెన్సింగ్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 5050mAh బ్యాటరీ, 10W ఫాస్ట్ ఛార్జింగ్, USB-C పోర్ట్ ఆండ్రాయిడ్ 11, రెండేళ్ల పాటు అప్ గ్రేడేషన్ ఆపరేటింగ్ సిస్టంట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే నోకియా జి20, నోకియా పవర్ ఇయర్ బడ్స్ లైట్ కాంబో కొనుగోలుపై రూ.2,099 డిస్కౌంట్ ఉండే అవకాశం ఉంది.