Toshiba Inverter AC: అమెజాన్‌లో రూ.96,700 విలువైన ఇన్వర్టర్‌ ఏసీ.. కేవలం రూ.5,900లకే.. లాభపడిన కస్టమర్లు

Toshiba Inverter AC: ఎంత పెద్ద సంస్థ అయినా అప్పుడప్పుడూ చిన్నపాటి లోపాలు జరుగుతూనే ఉంటాయి. చిన్నపాటి లోపమే పెద్ద నష్టానికి దారి తీస్తుంటుంది. కానీ చిన్నపాటి లోపాల..

Toshiba Inverter AC: అమెజాన్‌లో రూ.96,700 విలువైన ఇన్వర్టర్‌ ఏసీ.. కేవలం రూ.5,900లకే.. లాభపడిన కస్టమర్లు
Toshiba Ac
Follow us
Subhash Goud

|

Updated on: Jul 06, 2021 | 1:00 PM

Toshiba Inverter AC: ఎంత పెద్ద సంస్థ అయినా అప్పుడప్పుడూ చిన్నపాటి లోపాలు జరుగుతూనే ఉంటాయి. చిన్నపాటి లోపమే పెద్ద నష్టానికి దారి తీస్తుంటుంది. కానీ చిన్నపాటి లోపాల వల్ల కొందరు లాభపడుతుంటారు. ఇలాంటిదే జరిగింది. తాజాగా ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్ సంస్థ చేసిన ఒక పొరపాటు వల్ల చాలామంది వినియోగదారులు బెనిఫి‌ట్‌ పొందారు. అదేంటంటే తక్కువ ధరకే ఏసీ కొనుగోలు చేయడాం. దేశంలోనే అతి పెద్ద ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సోమవారం తొషిబా ఎయిర్ కండిషనర్‌ను చాలా తక్కువ ధరకే అందించింది. రూ.96,700గా ఉన్న ఈ ఏసీని 94 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.5900కు అందించింది. దీంతో చాలా మంది ఏసీని ఆర్డర్‌ చేసుకుని లాభపడ్డారు. తొషిబా స్ప్లిట్ ఏసీ సిస్టమ్‌ను అమ్మకానికి పెట్టేటప్పుడు అమెజాన్ సిబ్బంది చేసిన చిన్న పొరపాటు వల్ల ఇది జరిగింది. ఈ సంస్థ తమ తప్పిదాన్ని తెలుసుకునే లోపే చాలామంది కస్టమర్లు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకొని ఏసీని కొనుగోలు చేసేశారు. అసలైతే రూ.96,700 ఉన్న ఈ ఏసీని డిస్కౌంట్ గా 90,800 రూపాయలకు అందించాలి. రూ.5900 డిస్కౌంట్‌కు బదులు అమెజాన్ సిబ్బంది అసలు ధరనే రూ.5900 గా నిర్ణయించడంతో చాలామంది ఏసీని కొనుగోలు చేసేశారు. దీనికి నెలకు రూ. 278 రూపాయల నుంచి ఈఎంఐ కూడా అందించింది అమెజాన్.

అచ్చం ఇలాంటిదే తొషిబా1.8 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీని 59,490 కి 20 శాతం డిస్కౌంట్ మేరకు అందిస్తోంది. దీనికి రూ. 2800 నుంచి ఈఎంఐ ఆప్షన్ కూడా అందించింది. ఈ ఏసీలోని ప్రత్యేకతలు ఏంటంటే.. యాంటీ బ్యాక్టీరియల్ కోటింగ్, డస్ట్ ఫిల్టర్, డీ హ్యుమిడిఫైయర్ లాంటివి చాలానే ఉన్నాయి. ఈ ఏసీకి పూర్తి వారంటీ సంవత్సరంతో పాటు కంప్రెసర్, పీసీబీ, సెన్సార్స్, మోటార్స్, ఎలక్ట్రికల్ పార్ట్స్ కి మరో తొమ్మిదేళ్ల పాటు వారంటీ కూడా అందించింది. ఈ ఏసీకి 3.3 సీజనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ రేషియో (SEER) కూడా ఉంది. దీంతో పాటు ఈ ఏసీ గ్లాస్ వైట్ కలర్ లో 105 x 25 x 32 అంగుళాల వైశాల్యంతో లభిస్తోంది. అయితే చిన్న పొరపాటు వల్ల ఇలా జరిగిపోయింది. దీంతో చాలా మంది లాభపడ్డారు. లోపం జరిగిన తర్వాత గుర్తించిన అమెజాన్‌ సిబ్బంది వెంటనే సరి చేశారు. ఈ తొషిబా ఏసీ ఇన్వర్టర్ టెక్నాలజీని వినియోగించుకుంటోంది. ఇది ఒక రకమైన ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీ. ఇందులో భాగంగా ఏసీ అవసరాలకు తగినట్లుగా కంప్రెసర్ స్పీడ్ అడ్జస్ట్ అవుతుంది. ఇందులోని IAQ ఫిల్టర్ ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్ లను దూరం చేస్తుంది. ఇందులోని ఫిల్టర్ దాన్ని తరచూ శుభ్రం చేస్తుంది. తద్వారా అందులో నుంచి ఎలాంటి వాసన రాకుండా ఫంగస్ ఉండకుండా కాపాడుతుంది.అయితే అమెజాన్‌లో తక్కువ ధరలకు పరికరాలను ఇవ్వడం ఇదేమి మొదటిసారేమి కాదు. ప్రైమ్‌ డే 2019లో రూ.9 లక్షల విలువైన కెమెరాను కేవలం రూ.6,500లకు విక్రయించారు. అప్పుడప్పుడు జరిగే ఇలాంటి పొరపాట్లను ఆసరా చేసుకుంటున్న కస్టమర్లు వెంటనే బుకింగ్‌ చేసుకుంటూ లాభపడుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Smartwatch Explodes: నాలుగేళ్ల చిన్నారి చేతి మణికట్టుపై పేలిన స్మార్ట్‌ వాచ్‌.. తీవ్ర గాయాలు

Russia Plane Missing: 28 మందితో వెళ్తున్న విమానం అదృశ్యం.. రంగంలోకి దిగిన సహాయక బృందాలు