Russia Plane Missing: 28 మందితో వెళ్తున్న విమానం అదృశ్యం.. రంగంలోకి దిగిన సహాయక బృందాలు
Russia Plane Missing: రష్యా నుంచి బయలుదేరిన ఓ విమానం అదృశ్యం అయ్యింది. ఫార్ ఈస్ట్ లోని పెట్రో పవ్లోస్క్- కామ్‌చట్‌స్కీ నుంచి పలానా వెళ్తున్న ఓ విమానంతో..
Russia Plane Missing: రష్యా నుంచి బయలుదేరిన ఓ విమానం అదృశ్యం అయ్యింది. ఫార్ ఈస్ట్ లోని పెట్రో పవ్లోస్క్- కామ్‌చట్‌స్కీ నుంచి పలానా వెళ్తున్న ఓ విమానంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంబంధాలు తెగిపోవడంతో అదృశ్యమైంది. అయితే షెడ్యూల్ ప్రకారం ల్యాండింగ్ జరగకపోవడంతో అప్రమత్తమైన అధికారులు .. విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విమానంలో 22 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అయితే ప్రయాణికులలో కొందరు కొందరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. అదృశ్యమైన విమానం సముద్రంలో పడిపోయిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పలానా పట్టణం దగ్గరలోని బొగ్గు గనిలో కూలిపోయి ఉండొచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విమానం ఆచూకీ కనిపెట్టేందుకు రంగంలోకి దిగిన రెండు హెలికాప్టర్లు .. గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్న ప్రాంతాలకు సహాయక బృందాలు బయలుదేరాయి.
కాగా, ఒకప్పుడు విమాన ప్రమాదాలకు పేరుగాంచిన రష్యా.. ఇటీవల కాలంలో తన ఎయిర్ ట్రాఫిక్ భద్రత రికార్డును మెరుగు పర్చింది. గతంలో చాలా విమానాలు అదృశ్యం కావడం, తర్వాత సముద్రంలో కూలిపోవడంతో, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జరిగింది. ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా రష్యా చర్యలు చేపట్టడంతో ప్రమాదాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా మళ్లీ విమానం అదృశ్యంపై సంచలనంగా మారింది. అదృశ్యమైన విమానం సముద్రంలో ఎక్కడో ఓ చోట కూలిపోయి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విమానాన్ని గాలింపు కోసం మరిన్ని హెలికాప్టర్లను, సహాయక సిబ్బందిని రంగంలోకి దింపింది రష్యా.