Dalai Lama’s Birthday: టిబెటన్ అధ్యాత్మిక గురువు దలైలామా గురించిన ఆసక్తికర విషయాలు మీకోసం..

Dalai Lama’s Birthday: టిబెటన్ అధ్యాత్మిక గురువు దలైలామా గురించిన ఆసక్తికర విషయాలు మీకోసం..
Dalai Lama

Dalai Lama’s Birthday: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమత అధిపతి, 14 వ దలైలామా టెన్జిన్ గయాట్సో పుట్టిన రోజు నేడు.

Shiva Prajapati

|

Jul 06, 2021 | 12:16 PM

Dalai Lama’s Birthday: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, టిబెటన్ బౌద్ధమత అధిపతి, 14 వ దలైలామా టెన్జిన్ గయాట్సో పుట్టిన రోజు నేడు. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యావత్ ప్రపంచానికి దలై లామా సుపరిచితులే అని చెప్పొచ్చు. ఆధ్యాత్మికతపై, రాజకీయాలపై, ప్రంపచంలో వెలుగుచూస్తున్న అణచివేతపై గళం విప్పిన గొప్ప వ్యక్తి దలైలామా. తన పూర్వీకుల మాదిరిగా కాకుండా.. తెలిసిన విషయాన్ని ప్రపంచ సంక్షేమం కోసం వినియోగించాలని తపించిన మహానుభావుడు. శాంతి సందేశాన్ని విశ్వ వ్యాప్తం చేయాలని కంకణం కట్టుకున్నారు దలై లామా. ఈ నేపథ్యంలోనే అనేక పుస్తకాలు రచించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక సభలు, సమావేశాల్లో పాల్గొని శాంతి ప్రవచనాలు పలికారు. శాంతి యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. దలైలామా ఇచ్చే ప్రసంగాన్ని ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది వింటారు. మెక్లియోడ్ గంజ్‌లో నివాసం ఉంటుంన్న దలైలామా.. టిబెటన్ బౌద్దమత ఆధ్యాత్మిక అధిపతిగా, 14వ దలైలామాగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ ఆధ్యాత్మిక గురువు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1. ప్రస్తుత దలైలామా ఆయన పూర్వీకులందరి కంటే కూడా ఎక్కువ కాలం ఆ పదవిలో ఉన్నారు. ఏదో మార్పు జరిగితే తప్ప.. తానే చివరి దలైలామా అవ్వొచ్చని అనేక సార్లు దలైలామా ప్రకటించారు. తాను 90 సంవత్సరాల వయస్సుల్లో ‘పదవీ విరమణ’ చేయొచ్చు అని 2011లో ప్రకటించారు.

2. 14వ దలైలామా కుటుంబ సభ్యులెవరు కూడా టిబెటన్ భాష మాట్లాడరు. వాస్తవానికి వీరు చైనా పశ్చిమ ప్రావిన్సులో మాట్లాడే చైనీస్ మాండలికంలో మాట్లాడుతారు.

3. 1989లో 14 వ దలైలామాను శాంతి నోబెల్ బహుమతితో సత్కరించారు. 2007లో యుఎస్ కాంగ్రెస్.. అత్యున్నత పౌర సత్కారమైన ‘కాంగ్రెస్ గోల్డ్ మెడల్’ను ప్రకటించి ఆయనను గౌరవించింది. దలైలామా అణ్వాయుధాలకు బద్ధ వ్యతిరేకి. ఈ నేపథ్యంలో ఆయన.. న్యూక్లియర్ ఏజ్ పీస్ ఫౌండేషన్‌లో సలహాదారుగా పనిచేస్తున్నారు.

4. దలైలామాకు చిన్నప్పటి నుంచీ సైన్స్ పట్ల ఎంతో ఆసక్తి ఉంది. తాను ఆధ్యాత్మిక గురువు కాకున్నట్లయితే.. ఇంజనీర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. దలైలామా తన యవ్వనంలో గడియారాలను మరమ్మతులు చేయడం వంటి చిన్న పరిశోధనా పనులు చేసేవారంట. దలైలామాకు కార్లంటే చాలా ఇష్టమట.

5. 2009లో టేనస్సీలో మాట్లాడిన దలైలామా తనను తాను స్త్రీవాదిగా ప్రకటించుకున్నారు. మహిళల హక్కుల కోసం తాను పోరాడుతానని చెప్పారు. బౌద్ధ విశ్వాసం ప్రకారం.. ఆడపిల్ల అనే నెపంతో అబార్షన్ చేయించడం చేయడం తప్పు అన్నారు. అంతేకాదు.. అనేక ఆధ్యాత్మిక, నైతిక, శాంతికి సంబంధించి ఎన్నో ప్రసంగాలు దలైలామా చేశారు.

Also read:

Ranveer Singh Birthday: రణవీర్ ఫస్ట్ యాక్టింగ్ క్లాసు.. అతడు ఏం చేశాడో చూస్తే మీరూ నవ్వాపుకోలేరు.!

Google Maps: విదేశీ పర్యాటకులకు చుక్కలు చూపించిన గూగుల్‌ మ్యాప్‌.. అసలేం జరిగిందంటే..!

Karthika Deepam: కార్తీక్ నిర్దోషి నమ్మమని దీప కి చెబుతున్న సౌందర్య.. దీపకి పెళ్లి బట్టలు పెట్టడానికి రెడీ అవుతున్న మోనిత

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu