Karthika Deepam: కార్తీక్ నిర్దోషి నమ్మమని దీప కి చెబుతున్న సౌందర్య.. దీపకి పెళ్లి బట్టలు పెట్టడానికి రెడీ అవుతున్న మోనిత

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో ట్విస్ట్ తో సాగిపోతుంది. ఈ రోజు 1084 ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది...

Karthika Deepam: కార్తీక్ నిర్దోషి నమ్మమని దీప కి చెబుతున్న సౌందర్య.. దీపకి పెళ్లి బట్టలు పెట్టడానికి రెడీ అవుతున్న మోనిత
Karhika Deepam
Follow us
Surya Kala

|

Updated on: Jul 06, 2021 | 11:53 AM

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో ట్విస్ట్ తో సాగిపోతుంది. ఈ రోజు 1084 ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. దీప.. హిమ శౌర్యలను ఎక్కడికి వెళ్లారు అని ప్రశ్నిస్తే.. భాగ్యం అమ్మమ్మ దగ్గరకి వెళ్ళమని చెబుతారు. ఎందుకు అంటే.. నువ్వు నాన్న మాట్లాడుకోవడం లేదు కదా అందుకే అడగడానికి వెళ్ళమని చెబుతారు. ఏమని చెప్పింది అని ఆతృతతో అడిగితె.. నేను తాతయ్య కూడా చాల సార్లు గొడవ పడతాం.. మళ్ళీ కలిసి పోతాం.. మీ అమ్మ నాన్న కూడా అంతే ఒక వారంలో కలిసి పోతారు అని అమ్మమ్మ చెప్పింది అంటుంది.

కార్తీక్ మోనిత గురించి ఆలోచిస్తాడు.. పెళ్లి ఎలా ఆపాలి.. అని ఆలోచిస్తుంటే.. దీప కార్తీక్ మాటలను గుర్తు చేసుకుంటుంది.. మోనిత సాక్షి సంతకం పెట్టడానికి నిన్ను మా అమ్మని తీసుకుని రమ్మనమని విషయం గుర్తు చేసుకుంటుంది.. ఇంతలో సౌందర్య.. దీప ఫోన్ చేసి.. కార్తీక్ ని నమ్మమని చెబుతుంటే… దీప సౌందర్య మాటలను ఎవాయిడ్ చేస్తుంది.. వాడి వైపు నుంచి ఆలోచించడం మొదలు పెట్టమని సౌందర్య రిక్వెస్ట్ చేస్తుంది. కార్తీక్ నిర్దోషి అని గుర్తించమని చెబుతుంది. ఎవరికీ న్యాయం జరుగుతుంది.. ఎవరు అన్యాయం అయిపోతారు అని ఆలోచిస్తుంది సౌందర్య.. ఎదో మాయ జరిగింది. ఇదంతా కట్టుకథలా ఉంది అని కార్తీక్ గురించి సౌందర్య ఆలోచిస్తుంది..

మోనిత పెళ్లి బట్టలను ప్యాక్ చేసే పనిలో ఉంటె.. ప్రియమణి మీలో నాకు నచ్చింది మీ ధైర్యమే నాకు తెగ నచ్చేస్తుంది. ఇలాంటి దైర్యం ప్రతి అమ్మాయికి ఉంటె చాలా కాపురాలు నిలబడతాయి.. అలాగే చాలా కాపురాలు కూలతాయి కూడా.. రేపు దీపమ్మ ఇంటికి వెళ్లి చీర పెడితే.. తను తీసుకోదని తెలుసు.. అయినా అలాగే అక్కడ ఎంత పెద్ద రచ్చ జరుగుతుందో తెలుసు.. చీర ఇవ్వడానికి వెళ్తున్నారు.. ఇన్ని తెలిసి రేపు ఉదయం మీరు వెళ్తున్నారంటే.. మీ దైర్యం అనుకోవాలో… మిమ్మల్ని అనుమానించినందుకు కక్ష్య సాధిస్తున్నారో.. లేక కార్తీకయ్య మీద ప్రేమ అనుకోవాలో నాకు తెలియడం లేదంటే.. కార్తీక్ మీద ప్రేమ అనుకో అంటుంది..

దీప సౌందర్య.. కార్తీక్ ల మాటలు గుర్తు చేసుకుంటుంది. వారణాసికి ఫోన్ చేసి రేపు పొద్దున్న ఎక్కడికో వెళదామని చెబుతుంది.

భాగ్యం మోనిత దగ్గరకు వెళ్లి రవ్వలడ్డులు పట్టుకొస్తా… అని శ్రావ్య తో అంటుంది. అదేమైనా కూతురా అంటే.. ఆ వరస అయ్యేటల్టు చేస్తున్నాడుగా మీ బావగారు.. అయినా మన బంగారం మంచిది ఐతే ఎవరినో అనాల్సిన పని ఉండదు అంటుంది.

దీప పిల్లల్ని అన్నం తినమని అడిగితే.. అందరం కలిసి భోజనం చేద్దామని అంటారు. మీ నాన్న రావడం లెటు అవుతుంది. అంటే ఇంతలో కార్తీక్ వస్తాడు.. ఎందుకు నాన్న అంటే నీకు ఇష్టం లేదు అంటే… నేను వెళ్తాను అంటే.. నువ్వే ఇక్కడికి అమ్మని పంపించేశావు అనుకున్నాం.. కానీ అమ్మే వచ్చేసిందని తెలిసింది.. ఎందుకు నాన్నతో సరిగ్గా మాట్లాడడం లేదు అని ప్రశ్నిస్తున్న పిల్లలతో.. చాల్లే ఆపండి.,. అని కార్తీక్ తో మీరు పిల్లల దృష్టిలో మంచివారు.. కావాలి,, నేను చెడ్డదాని కావాలి.. మీ అమ్మగారి సుపుత్రుడు.. పిలల్లతో మంచిగా ఎందుకు మాట్లాడడం లేదు అంటే.. మరి నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు అని అంటాడు కార్తీక్.. నేను మాట్లాడుతూనే ఉన్నాగా అంటే.. ఎప్పుడు ఇలాంటప్పుడా అంటాడు కార్తీక్. అమ్మ మీరు ఇద్దరు గొడవ పడొద్దు.. అంటారు పిల్లలు.. అంటే ఏమి కూర.. అంటే ఇష్టమైనదే అంటే.. మీకు ఇష్టమైంది అంటుంది.. స్నానం చేసి వస్తా తిందాం అని కార్తీక్ అక్కడ నుంచి వెళ్తుంటే.. దీప కూడా వెళుతుంది. అమ్మానాన్న ఇప్పుడే గొడవ పడ్డారు.. ఇప్పుడే కలిసిపోయారు.. అనవసరంగా మనమే గొడవ పెట్టినట్లు అయింది అనుకుంటారు హిమ, శౌర్యలు. కార్తీక్ మోనిత పెళ్లి గురించి .. దీప తనని ప్రశ్నించింది.. తల్లి అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. ఈ జీవితం నాది నేను ఏ తప్పు చేయలేదు.. ఎందుకు తల దించుకోవాలి.. ఎందుకు అపరాధ భావంతో కుంగిపోవాలి.. నో అనుకుంటాడు.

Also Read:  రికార్డు సాధించిన 17 ఏళ్ల కుర్రాడు.. 91 దేశాల జాతీయ గీతాల‌ను అలవోకగా ఆలపిస్తూ..