National Anthems: రికార్డు సాధించిన 17 ఏళ్ల కుర్రాడు.. 91 దేశాల జాతీయ గీతాల‌ను అలవోకగా ఆలపిస్తూ..

Atharv Mule: సాధారణంగా ఓ పది దేశాల జాతీయ గీతాలను ఆలపిస్తేనే మనం ఆశ్యర్యంగా చూస్తుంటాం.. అలాంటిది 91 దేశాల జాతీయ గీతాలను పాడితే.. నోరెళ్లబెట్టడం ఖాయం.

National Anthems: రికార్డు సాధించిన 17 ఏళ్ల కుర్రాడు.. 91 దేశాల జాతీయ గీతాల‌ను అలవోకగా ఆలపిస్తూ..
Atharv Mule
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 06, 2021 | 11:00 AM

Atharv Mule: సాధారణంగా ఓ పది దేశాల జాతీయ గీతాలను ఆలపిస్తేనే మనం ఆశ్యర్యంగా చూస్తుంటాం.. అలాంటిది 91 దేశాల జాతీయ గీతాలను పాడితే.. నోరెళ్లబెట్టడం ఖాయం. ఎన్నో దేశాల జాతీయ గీతాలను పాడి ఓ యువకుడు సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర‌కు చెందిన 17 ఏళ్ల కుర్రాడు అధర్వ్ అమిత్ మూలే ఈ స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసి ఆశ్యర్యంలో ముంచెత్తాడు. 91 దేశాల‌కు చెందిన జాతీయ గీతాల‌ను తప్పులు లేకుండా ఆల‌పిస్తున్నాడు. ఈ మేరకు అధర్వ్ మూలే ఇండియ‌న్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అత‌ను పుర‌స్కారం కూడా అందుకున్నాడు. పాకిస్థాన్‌, ఆప్ఘానిస్తాన్, బ్రిట‌న్, ఖ‌తార్‌, సిరియా, య‌మెన్‌, న్యూజిలాండ్‌ లాంటి దేశాల జాతీయ గీతాల‌ను కూడా అథ‌ర్వ అమిత్ మూలే చాలా అల‌వోక‌గా ఆలపిస్తున్నాడు.

భారతీయులం.. వ‌సుదైక కుటుంబం అన్న విశ్వాసాల‌ను న‌మ్ముతామ‌ని, అందుకోస‌మే ఇత‌ర దేశాల‌కు చెందిన జాతీయ గీతాల‌ను నేర్చుకోవాల‌న్న ప‌ట్టుద‌ల త‌న‌లో క‌లిగిన‌ట్లు అధర్వ్ చెప్పాడు. అధర్వ్ జాతీయ గీతాల‌ను పాడ‌డ‌మే కాదు.. ఆయా దేశాల అర్ధాల‌ను కూడా అత‌ను విడ‌మ‌రిచి చెప్పి ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. దీని కారణంగా అధర్వ తన పేరును ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేసుకున్నారు. వివిధ దేశాల జాతీయ గీతాలను పాడిన రికార్డును కైవసం చేసుకున్నందుకు అధర్వ సంతోషం వ్యక్తంచేస్తున్నాడు.

అధర్వ వడోదర నివాసి. ప్రస్తుతం అతను కాలేజీలో చదువుతున్నాడు. 5 సంవత్సరాల క్రితం తాను పాకిస్తాన్ జాతీయ గీతాన్ని విన్నానని అధర్వ్ చెప్పాడు. ఆసక్తి, పట్టుదలతో నేర్చుకున్నట్లు తెలిపాడు.

Also Read:

Love Marriage: తెలంగాణ అబ్బాయి.. నేపాల్ అమ్మాయికి పెళ్లి.. కాళ్లు కడిగి కన్యాదానం చేసిందెవరంటే..

India Covid-19: గుడ్ న్యూస్.. భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 97 శాతం దాటిన రికవరీ రేటు..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..