India Covid-19: గుడ్ న్యూస్.. భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 97 శాతం దాటిన రికవరీ రేటు..
India Coronavirus Cases: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఇటీవల కాలంలో భారీగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో
India Corona Cases: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఇటీవల కాలంలో భారీగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 34,703 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ మొదలైన 111 రోజుల తర్వాత కనిష్ట స్థాయిలో కోవిడ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97.17 శాతంగా ఉంది. దీంతోపాటు రోజువారీ పాజిటివిటీ రేటు 2.11 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మొత్తం కేసుల సంఖ్య 3,06,19,932 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,03,281 కి చేరింది.
ఇదిలాఉంటే.. నిన్న కరోనా మహమ్మారి నుంచి 51,864 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో దేశంలో ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 2,97,52,294 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,64,357 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశంలో 35,75,53,612 వ్యా్క్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
కాగా నిన్న దేశవ్యాప్తంగా 16,47,424 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి 42,14,24,881 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది.
Also Read: