కొత్త పెళ్లి జంటకు 9 లక్షల జరిమానా..! 50 మందికి అనుమతి ఉంటే 1000 మందిని పిలిచినందుకు ఫైన్..

కొత్త పెళ్లి జంటకు 9 లక్షల జరిమానా..! 50 మందికి అనుమతి ఉంటే 1000 మందిని పిలిచినందుకు ఫైన్..
Marriage Wedding Hindu India

ఛత్తీస్ గడ్‌లోని సుర్గుజా జిల్లాలో ఓ వివాహ వేడుకకు 1000 మందికి పైగా అతిథులు హాజరైనందుకు అధికారులు రూ.9 లక్షల 50 వేల జరిమానా విధించారు.

uppula Raju

| Edited By: Rajitha Chanti

Jul 06, 2021 | 8:58 AM

ఛత్తీస్ గడ్‌లోని సుర్గుజా జిల్లాలో ఓ వివాహ వేడుకకు 1000 మందికి పైగా అతిథులు హాజరైనందుకు అధికారులు రూ.9 లక్షల 50 వేల జరిమానా విధించారు. అంతేకాదు జిల్లా యంత్రాంగం ఆ ఫంక్షన్ హాల్‌కి సీలు వేసింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు డిఎం సంజీవ్ కుమార్ సూచనలను అనుసరించి ఫైన్ వేసినట్లు సుర్గుజా జిల్లా అధికారులు తెలిపారు. మ్యారేజ్ హాల్ మేనేజర్, వధూవరుల వైపు మొత్తం కలిపి రూ.9 లక్షల 50 వేల జరిమానా విధించామని పేర్కొన్నారు.

అంబికాపూర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ప్రదీప్ సాహు మాట్లాడుతూ.. ఈ నెల 2 వ తేదీన నగరంలోని చౌరేసియా మ్యారేజ్ గార్డెన్‌లో వివాహం జరిగింది. ఈ సమయంలో పెళ్లికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడినట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. దర్యాప్తు చేసినప్పుడు సుమారు 1000 మంది అతిథులు హాజరయ్యరని తేలింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి వివాహ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిసింది.

జిల్లాలో పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యే వారి సంఖ్యను గరిష్టంగా 50 గా నిర్ణయించారు. చౌరాసియా మ్యారేజ్ గార్డెన్ ఆపరేటర్ వీరేంద్ర చౌరేషియాపై 4 లక్షల 75 వేల రూపాయలు, వరుడు తండ్రి సరోజ్ సాహుపై 2 లక్షల 37 వేల రూపాయలు, వరుడిపై 2 లక్షల 37 వేల రూపాయలు ఫైన్ విధించారు. జరిమానా చెల్లింపును మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి పంపినట్లు అధికారి తెలిపారు. కోవిడ్ -19 నివారణకు సుర్గుజా జిల్లా యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

గతంలో.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన రాంబాబుకు.. కొవిడ్ నిబంధనలను అనుసరించి 20 మందితో వివాహం నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అందుకు విరుద్ధంగా అతను ఏకంగా 200 మందిని పిలవడంతో 2 లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో ఎవరూ ఇలా నిబంధనలు ఉల్లంఘించకుండా అధికారులు భారీ జరమానా విధిస్తున్నారు.

Earthquake : ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.7 గా నమోదు..

Andhra Pradesh: కరోనా బాధిత గవర్నమెంట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్..!

Vidya Balan: విద్యాబాలన్‌కు అరుదైన గౌరవం..! జమ్మూకశ్మీర్‌లోని ఓ మిలిటరీ ఫైరింగ్‌ రేంజ్‌కు ఆమె పేరు

Andhrapradesh: ‘జగనన్న హౌసింగ్ కాలనీలకు ఇసుక కొరత లేనే లేదు’.. వారికి ఫ్రీగానే ఇస్తున్నామన్న ద్వివేది

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu