AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidya Balan: విద్యాబాలన్‌కు అరుదైన గౌరవం..! జమ్మూకశ్మీర్‌లోని ఓ మిలిటరీ ఫైరింగ్‌ రేంజ్‌కు ఆమె పేరు

బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌కు అరుదైన గౌరవం దక్కింది. జమ్మూకశ్మీర్‌లోని ఓ మిలిటరీ ఫైరింగ్‌ రేంజ్‌కు విద్యా బాలన్‌గా ఇండియన్ ఆర్మీ నామకరణం చేసింది.

Vidya Balan: విద్యాబాలన్‌కు అరుదైన గౌరవం..! జమ్మూకశ్మీర్‌లోని ఓ మిలిటరీ ఫైరింగ్‌ రేంజ్‌కు ఆమె పేరు
Vidya Balan
Ram Naramaneni
|

Updated on: Jul 06, 2021 | 12:03 AM

Share

బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌కు అరుదైన గౌరవం దక్కింది. జమ్మూకశ్మీర్‌లోని ఓ మిలిటరీ ఫైరింగ్‌ రేంజ్‌కు విద్యా బాలన్‌గా ఇండియన్ ఆర్మీ నామకరణం చేసింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి  అందిస్తున్న అసాధారణ సేవలకు గుర్తుగా ఆ ఫైరింగ్‌ రేంజ్‌కు ఆమె పేరును పెట్టినట్లు భారత సైన్యం తెలిపింది. ఆ ప్రదేశం కశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో ఉంది. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నప్పటికీ.. ఈ అంశంపై విద్యా బాలన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్‌ ఆర్మీ నిర్వహించిన వింటర్‌ ఫెప్టివల్‌కు విద్యాబాలన్‌.. ఆమె భర్త సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌తో కలిసి హాజరయ్యారు. ఆస్కార్‌ అవార్డుల పాలకమండలి ‘అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ సైన్సెస్‌’లో చేరాలంటూ ఆమెకు ఇన్విటేషన్ అందిన విషయం తెలిసిందే. ఆమె నటించిన ‘షేర్నీ’  మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో ఇటీవల విడుదలైంది. అందులో ఆమె పోషించిన పాత్రపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాను మామూలు మధ్యతరగతి నుంచి వచ్చానని,  తన కుటుంబంలో ఎవరూ సినిమా బ్యాక్ గ్రౌండ్ కు సంబంధం ఉన్నవాళ్లు లేరని గతంలో విద్యాబాలన్ తెలిపింది.  మొదట యాడ్స్ లో నటించానన్న ఈ  సుందరి.. టాలెంట్ ఉన్నప్పటికీ రీజన్ చెప్పకుండానే తనను పక్కన పెట్టేవారని బాధను వ్యక్తం చేసింది.  2002లో మాధవన్ హీరోగా తెరకెక్కిన ‘రన్’ సినిమాలో మొదట హీరోయిన్‌గా విద్యాబాలన్‌ను తీసుకున్నారు. ఆ తర్వాత  ఆమె ప్లేస్‌లో మీరా జాస్మిన్‌ను ఎంపిక చేశారు. ఆ తదుపరి కూడా కొన్ని సినిమాల్లో విద్యాబాలన్‌కు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారాయి. బాలీవుడ్‌లో ‘పరిణీత’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విద్యా… ‘డర్డీ పిక్చర్స్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది. తెలుగులో ఈ భామ బాలకృష్ణ హీరోగా నటించిన‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో నందమూరి బసవతారకం పాత్రలో నటించింది.

Also Read: కరోనా బాధిత గవర్నమెంట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్..!

ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ చేయనున్న స్టార్ ప్రొడ్యూసర్.. వైరల్ అవుతున్న ట్వీట్

కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?