Andhra Pradesh: కరోనా బాధిత గవర్నమెంట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్..!

కరోనా బాధిత ప్రభుత్వ ఉద్యోగులకు 20 రోజుల సెలవులను మంజూరు చేసేందుకు ఏపీ సర్కార్ అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తరహాలొనే 15 రోజుల...

Andhra Pradesh:  కరోనా బాధిత గవర్నమెంట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్..!
AP-Government
Follow us

|

Updated on: Jul 05, 2021 | 11:48 PM

కరోనా బాధిత ప్రభుత్వ ఉద్యోగులకు 20 రోజుల సెలవులను మంజూరు చేసేందుకు ఏపీ సర్కార్ అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తరహాలొనే 15 రోజుల ప్రత్యేక సాధారణ సెలవులు, మరో 5 రోజుల కమ్యూటెడ్ సెలవులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకారాన్ని తెలిపారని ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ తెలిపింది. ఉద్యోగులు, లేదా వారి కుటుంబ సభ్యులు కోవిడ్ బారిన పడితే ఈ సెలవులు వర్తింప చేయాలని చేసిన విజ్ఞప్తిని గవర్నమెంట్ అంగీకరించిందని ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. కరోనా సోకిన ఉద్యోగులకు 20 రోజుల సెలవును ఇస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు రాష్ట్రంలోనూ వర్తింపజేసేందుకు సీఎం జగన్ అంగీకారాన్ని తెలిపినట్టు ఆయన వెల్లడించారు. రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఎవరికి కరోనా వచ్చినా 20 రోజుల సెలవులు మజూరు చేస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు యధాతథంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

వ్యాక్సినేషన్‌పై సీఎం కీలక ఆదేశాలు…

ఇక, కరోనా వాక్సినేషన్‌ లో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు దాటిన వారికి చేపడుతున్న వాక్సినేషన్‌ 90 శాతం పూర్తైన తర్వాత ఉపాధ్యాయులకు, మిగిలిన వారికి వాక్సినేషన్‌ ఇవ్వాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు ఇప్పటికే వాక్సినేషన్‌ ఇస్తున్నామని.. 5 యేళ్లు దాటిన పిల్లలున్న తల్లులకు ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు సీఎం కు విన్నవించారు.

రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు తగ్గుతున్నాయని, ఇప్పటివరకు నమోదైన కేసులు 3670, కాగా, గడిచిన 24 గంటలలో 33 కేసులు నమోదయ్యాయని తెలిపారు. మరణించిన వారు 295 మంది ఉండగా, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినవారు 2075 మంది ఉన్నారని సీఎంకు అధికారులు తెలిపారు.

Also Read:b దూకుడు పెంచిన తెలంగాణ .. పులిచింతలలో షాకింగ్ స్టెప్

‘జగనన్న హౌసింగ్ కాలనీలకు ఇసుక కొరత లేనే లేదు’.. వారికి ఫ్రీగానే ఇస్తున్నామన్న ద్వివేది