AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhrapradesh: ‘జగనన్న హౌసింగ్ కాలనీలకు ఇసుక కొరత లేనే లేదు’.. వారికి ఫ్రీగానే ఇస్తున్నామన్న ద్వివేది

విశాఖ జిల్లాలో లేటరైట్ మైనింగ్​తో అక్రమాలు జరుగుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు.

Andhrapradesh:  'జగనన్న హౌసింగ్ కాలనీలకు ఇసుక కొరత లేనే లేదు'.. వారికి ఫ్రీగానే ఇస్తున్నామన్న ద్వివేది
Gopala Krishna Dwivedi
Ram Naramaneni
|

Updated on: Jul 05, 2021 | 10:59 PM

Share

విశాఖ జిల్లాలో లేటరైట్ మైనింగ్​తో అక్రమాలు జరుగుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ 6 లీజులు మాత్రమే లేటరైట్ తవ్వకాల కోసం గనుల శాఖ మంజూరు చేసిందని తెలిపారు. 2019లో మరో లీజు కూడా ఇచ్చామని వివరించారు. కేవలం 5 వేల టన్నుల లీజుకు ఇస్తే.. వేల కోట్ల అక్రమాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. మొత్తం ఖనిజం విలువ కూడా అంత లేదని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో బాక్సైటు మైనింగ్ కు సైతం పర్మిషన్ ఇవ్వలేదని,.. దీనిపై స్పష్టమైన ఉత్తర్వులు కూడా ఇచ్చామన్నారు. ఇక రాష్ట్రంలో నిర్మించే జగనన్న హౌసింగ్ కాలనీలకు ఇసుక కొరత లేదని గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. 40 కిలోమీటర్ల పరిధిలోని లబ్ధిదారులు ఇసుకను ఫ్రీగా తీసుకువెళ్తున్నారని, దీనికి సంబంధించి కూపన్లు కూడా జారీ అయ్యాయని వివరించారు. 40 కిలోమీటర్లు దాటితే ప్రభుత్వమే ఇసుకను సరఫరా చేస్తోందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జేపీ పవర్ వెంచర్స్ సంస్థ 200 రీచ్ లలో ఇసుక తవ్వకాలు చేస్తోందన్నారు. వర్షాకాలం కావడంతో 50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వచేస్తున్నట్టు ద్వివేది వివరించారు.

ప్రకాశం బ్యారేజీలో డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను తవ్వితీసేందుకు ప్రతిపాదనలను సిద్దం చేస్తున్నామని, దాని ద్వారా దాదాపు కోటి టన్నుల వరకూ ఇసుక లభ్యం అయ్యే అవకాశముందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇసుకను అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారన్న కంప్లైంట్ వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ద్వివేది తెలిపారు.

Also Read: శ్రీశైలంలో అంతు చిక్కని రహస్యం.. డ్రోన్ల చక్కర్లపై ఫోకస్ పెట్టిన కర్నూలు ఎస్పీ..

హై హీల్స్ తో మహిళా సైనికుల మార్చ్ ఫాస్ట్..! ఉక్రెయిన్ అధికారులపై తీవ్ర విమర్శలు

Follow Us
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది