Sirisha Bandla: మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదని ప్రతీ సారి కొందరు అతివలు నిరూపిస్తూనే ఉన్నారు. నేలపైనే కాదు.. నింగిలోనూ వారి సత్తా చాటుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ విషయంలో తెలుగు మహిళలు కూడా తమ సత్తా చాటుతూ.. నేతి తరం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖంగా మనకు వినిపించే పేర్లు.. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, కరణం మల్లీశ్వరీ లాంటి వారెందరలో ఉన్నారు. వీరితో పాటు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పేరు బండ్ల శిరీష. రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా పేరు పొందారు. ఆ తరువాత కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళలుగా పేరుగాంచారు. వీరిద్దరు భారత దేశ ఘనతను ప్రపంచానికి చాటి చెప్పారు. వీరిలో కల్పనా చావ్లా అంతరిక్షయానంలో మరణించారు.