Ukrainian: హై హీల్స్ తో మహిళా సైనికుల మార్చ్ ఫాస్ట్..! ఉక్రెయిన్ అధికారులపై తీవ్ర విమర్శలు

మాములుగా సైనిక బలగాల మార్చ్ ఫాస్ట్ అంటే చాలా పకడ్బందీగా చేస్తుంటారు. దీనిలో సైనికులు ఉపయోగించే షూస్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అయితే, తాజాగా మహిళలతో హై హీల్స్ మార్చ్ ఫాస్ట్ చేయించిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

Ukrainian: హై హీల్స్ తో మహిళా సైనికుల మార్చ్ ఫాస్ట్..! ఉక్రెయిన్ అధికారులపై తీవ్ర విమర్శలు
March Fast With High Heels In Ukrainian
Follow us
Venkata Chari

|

Updated on: Jul 05, 2021 | 9:42 PM

March Fast With High Heels: మాములుగా సైనిక బలగాల మార్చ్ ఫాస్ట్ అంటే చాలా పకడ్బందీగా చేస్తుంటారు. దీనిలో సైనికులు ఉపయోగించే షూస్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అయితే, తాజాగా మహిళలతో హై హీల్స్ మార్చ్ ఫాస్ట్ చేయించిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దీంతో ఆదేశ అధికారులపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. సోవియట్ యూనియన్ నుంచి వేరుపడి స్వాతంత్రం పొందిన ఉక్రెయిన్.. వచ్చే ఆగస్టు నాటికి 30 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా జరిగే ఉత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాలకు రిహార్సల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్ అధికారులు మహిళా సైనికులతో హై హీల్స్ ధరింపజేసి మార్చ్ ఫాస్ట్ చేయించారు. పరేడ్ కమాండింగ్ ఆఫీసర్ పర్యవేక్షణలో జరిగిన ప్రాక్టీస్ పరేడ్ వేడుకలు జరిగాయి. అయితే ఈ ఫొటోలను ఉక్రెయిన్ ప్రభుత్వం సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీంతో అసలు సమస్య మొదలైంది. మహిళలో ఇలా మార్చ్ ఫాస్ట్ చేయిస్తారా అంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది మహిళల పట్ల వివక్షతను చూపించడమేనంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే అధికారుల బలవంతం వల్లే హైహీల్స్ ధరించినట్లు ఆ మహిళా సైనికులు వెల్లడించడంతో.. మరింతగా విమర్శలు పెరిగాయి. మహిళా సైనికులను శృంగార వస్తువుగా చూపెట్టడమేనంటూ ఖండిస్తున్నారు.

సైనిక బూట్లు లేకుండా మహిళా సైనికులు చేసిన మార్చ్ ఫాస్ట్ పట్ల పలు దేశాల ప్రజలు కూడా ఆందోళన, ఆశ్చర్యాలను వ్యక్తం చేస్తున్నారు. మహిళా సైనికుల ఆరోగ్యంపై కలిగే దుష్ర్పభావాలను కూడా పట్టించుకోలేదని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖపై దుమ్మెత్తి పోస్తున్నారు. దేశం ఎంతో ముందుకుపోతున్నా ఇంకా మహిళలపై ఇలాంటి వివక్షలు తగ్గడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలోనూ దారుణంగా కామెంట్లు పెడుతూ ఆ దేశ అధికారులను కడిగిపారేస్తున్నారు. ఉక్రెయిన్ ఆర్మీలో 31, 000 మందికి పైగా మహిళా సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 4,000 కు పైగా మహిళా సైనిక అధికారులు ఉన్నారు. కాగా, ఈ గొడవ ఉక్రెయిన్ పార్లమెంట్ కు పాకింది. దీనిపై విచారణ చేయించాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు.

Also Read:

Jeff Bezos: అమేజాన్‌ సీఈఓగా బెజోస్‌ వీడ్కోలు.. ఇక ఏం చేయనున్నాడు? అసలు అమేజాన్‌ ప్రస్థానం ఎలా మొదలైంది?

ఆమె ఒక కామపిశాచి..! కామంతో మగ ఖైదీలకు చుక్కలు చూపించిన..మహిళా పోలీస్ (వీడియో):Viral Video.