- Telugu News Photo Gallery Technology photos Monday is the last for jeff bezos as ceo for amazon from tomorrow bezos what will do
Jeff Bezos: అమేజాన్ సీఈఓగా బెజోస్ వీడ్కోలు.. ఇక ఏం చేయనున్నాడు? అసలు అమేజాన్ ప్రస్థానం ఎలా మొదలైంది?
Jeff Bezos: అమేజాన్ అనే బ్రాండ్‌ను విశ్వ వ్యాప్తం చేశారు ఆ సంస్థ సీఈఓ జెఫ్ బెజోస్. మూడు దశాబ్దాలుగా అమేజాన్ సీఈఓగా విధులు నిర్వర్తిస్తోన్న బెజోస్ ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నేటితో..
Updated on: Jul 05, 2021 | 7:08 PM

అమేజాన్ ఈ పేరు తెలియని సగటు మనిషి ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. అమెరికా నుంచి అనకాపల్లి వరకు అమేజాన్ తన సేవలను అందిస్తోంది. అమేజాన్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఆ సంస్థ సీఈఓ బెఫ్ బెజోస్ కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రపంచ కుబేరుళ్లో ఒకరిగా వెలిగిన బెజోస్ అమేజాన్ సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఈరోజుతో (జూలై 05) బెజోస్ పదవి కాలం ముగియనుంది. ఇక రేపటి నుంచి ఆయన ఏం చేయబోతున్నాడనే ప్రశ్నలు తలెత్తులున్నాయి.

బెజోస్ కేవలం అమేజాన్ సీఈవోగా మాత్రమే తప్పుకున్నారు. కానీ పని నుంచి కాదు.. అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేయడానికి ప్రారంభించిన ‘బ్లూ ఆరిజిన్’, ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థ ‘వాషింగ్టన్ పోస్ట్’, వాతావరణ మార్పులపై పోరాడేందుకు ప్రారంభించిన ‘బెజోస్ ఎర్త్ ఫండ్’, డే 1 ఫండ్ ప్రాజెక్టులపై బెజోస్ దృష్టి సారించనున్నారు. తన సోదరుడు మార్క్ బెజోస్‌తో కలిసి త్వరలో అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు.

1995లో అమెజాన్ పేరిట పుస్తకాలు అమ్మేందుకు ఓ చిన్న ఆన్‌లైన్ సంస్థను స్థాపించిన బెజోస్ దాన్ని అంచెలంచెలుగా పెంచి ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-కామర్స్ సంస్థగా తీర్చిదిద్దారు. అమెజాన్ నికర అమ్మకాలు 2020లో 38610 కోట్ల డాలర్లు.. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ.28.95 లక్షల కోట్లకు చేరాయి.

2026 నాటికి జెఫ్ బెజోస్ సంపద ఒక ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. బ్లూ ఆరిజిన్‌తో అంతరిక్ష రంగంలో బెజోస్ ఎలాంటి సంచలనాలకు తెర తీస్తారో చూడాలి.




