- Telugu News Photo Gallery Technology photos Nokia launch nokia g20 smart phone online booking starts from july 7th have look on features and price
Nokia G20 Features: మళ్లీ ఫామ్‌లోకి వస్తోన్న నోకియా.. మార్కెట్లోకి కొత్త ఫోన్ విడుదల. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు.
Nokia G20 Features: మొబైల్ ఫోన్ తయారీ దిగ్గజం నోకియా భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. నోకియా జీ20 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లను అందించింది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి..
Updated on: Jul 06, 2021 | 2:50 PM

ఒకప్పుడు మొబైల్ తయారీ రంగంలో సంచలనం సృష్టించిన నోకియా.. స్మార్ట్ ఫోన్‌ల రాక అనంతరం తన ప్రభావ్యాన్ని కోల్పోతూ వచ్చింది. అనంతరం విండోస్ మొబైల్స్‌తో వచ్చినా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

దీంతో ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లను విడుదల చేస్తూ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే కొద్ది నెలల క్రితం వరుసగా జీ, సీ, ఎక్స్ సిరీస్ ఫోన్లతో మళ్లీ సత్తా చాటే ప్రయత్నం చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా భారత మార్కెట్లోకి నోకియా మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. నోకియా జీ20 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ జులై 7న (రేపటి నుంచి) నోకియాతో పాటు అమేజాన్ వెబ్‌సైట్‌లో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

6.5 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం. ఈ స్మార్ట్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌ను అందించారు.

కెమెరా విషయానికొస్తే 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. 5,050 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత.

ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్ ధర రూ. 12,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజులు పనిచేస్తుంది.




