థియేటర్ల రీఓపెన్‏కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. సినిమాలు విడుదలయ్యేనా ?.. సందేహాలెన్నో…

గత కొద్ది రోజులుగా మూతపడిపోయిన థియేటర్లు రీఓపెన్ కాబోతున్నాయి. మళ్లీ సినిమా సందడి మొదలు కాబోతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

థియేటర్ల రీఓపెన్‏కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. సినిమాలు విడుదలయ్యేనా ?.. సందేహాలెన్నో...
Theatres
Follow us

|

Updated on: Jul 06, 2021 | 7:08 AM

గత కొద్ది రోజులుగా మూతపడిపోయిన థియేటర్లు రీఓపెన్ కాబోతున్నాయి. మళ్లీ సినిమా సందడి మొదలు కాబోతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సినీ ప్రియులకు శుభవార్త అందించింది. జూలై 8 నుంచి 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయవచ్చని అనుమతులు మంజూరు చేసింది. అయితే థియేటర్లలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలను కూడా జారీ చేసింది. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం యాభై శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయవచ్చని అనుమతి ఇచ్చినా .. ఇప్పటికీ ఒక్క కొత్త సినిమా విడుదల కాలేదు. అలాగే ప్రేక్షకుల తాకిడి కూడా అంతగా కనిపించడం లేదు. ఇక ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిసీ సందడి మళ్లీ షూరు అయ్యేలాగే కనిపిస్తుంది.

గతేడాది కరోనా ప్రభావం.. థియేటర్లు మూత పడి.. తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత లాక్ డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకుగా.. అన్ని చిన్న సినిమాలే విడుదలై మంచి విజయం అందుకున్నాయి. ఇక క్రమంగా కరోనా భయాన్ని పక్కన పెట్టి.. థియేటర్లకు ఆడియోన్స్ తాకిడి పెరుగుతున్న సమయంలో కరోనా మరోసారి పంజా విసిరింది. థియేటర్లు ఓపెన్ అయిన రెండు మూడు నెలల్లోనే మళ్లీ కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో విజృంభించింది. దీంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించకంటే ముందే థియేటర్లు మూతపడిపోయాయి. ప్రస్తుతం కోవీడ్ కేసులు తగ్గుతుండడంతో.. ప్రభుత్వాలు పలు సంస్థలకు సడలింపులు ఇస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. అటు వాయిదా పడిని సినిమా షూటింగ్ ప్రారంభమయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే థియేటర్లు ఓపెన్ కాగానే.. బడా హీరోల సినిమాలు మాత్రం విడుదలయ్యే అవకాశం కనపించడం లేదు. కేవలం చిన్న బడ్జెట్ సినిమాలతో థియేటర్లకు ప్రేక్షకులను రాబట్టే ప్రయత్నం చేయాల్సిందే. థియేటర్ల ఓపెన్ కు రెండు తెలుగు రాష్ట్రాలు అనుమతిచ్చిన నిర్మాతల్లో మాత్రం అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు సినిమాలను విడుదల చేస్తే.. బడ్జెట్ నగదును వసూలు చేయగలమా.. లేకా వంద శాతం ఆక్యూపెన్సీ అనుమతి వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లకు అనుమతి లభించినా.. సినిమాలు ఎప్పటినుంచి విడుదలవుతాయనేది కాస్తా అనుమానంగానే ఉంది. ఇక అగ్ర హీరోల సినిమాల కోసం మాత్రం ఇంకా రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సమావేశంలో.. నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలకు విక్రయించవద్దని.. థియేటర్లను దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినీ పరిశ్రమతోపాటు… థియేటర్ల యాజమానులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయామని.. సినిమాలను కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని… ఓటీటీ సంస్థలకు అమ్మవద్దని.. ఒకవేళ తమ డిమాండ్స్ బేఖాతరు చేస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని నిర్మాతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్.

Also Read: Bone death: కరోనా బాధితుల్లో మరో కొత్త సమస్య.. ఇప్పటి వరకు ముగ్గురిలో గుర్తించామన్న వైద్య నిపుణులు

Nayantara: సూపర్ స్టార్ సరసన ‏నయనతార ? మహేష్-త్రివిక్రమ్ మూవీలో లేడీ సూపర్ స్టార్…

Warangal metro: ఓరుగల్లులో మెట్రో రైల్ పరుగులకు అడుగులు.. వరంగల్ అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్