AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayantara: సూపర్ స్టార్ సరసన ‏నయనతార ? మహేష్-త్రివిక్రమ్ మూవీలో లేడీ సూపర్ స్టార్…

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం పరశురామ్ దరశత్వంలో "సర్కారు వారి పాట" సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత మహేష్..

Nayantara: సూపర్ స్టార్ సరసన ‏నయనతార ? మహేష్-త్రివిక్రమ్ మూవీలో లేడీ సూపర్ స్టార్...
Nayantara
Rajitha Chanti
|

Updated on: Jul 06, 2021 | 6:33 AM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం పరశురామ్ దరశత్వంలో “సర్కారు వారి పాట” సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత మహేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత.. మరోసారి వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్ మూవీకి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధకృష్ణ (చినబాబు) నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక మహేష్ నటించనున్న ఈ 28వ చిత్రానికి త్రివిక్రమ్ నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ ఇద్దరు హీరోయిన్స్ ను తీసుకోవాలని భావిస్తున్నాడట.

ఇక తాజా సమాచారం ప్రకారం.. మహేష్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మేకర్స్.. నయన్‏తో చర్చలు జరుపుతున్నారని టాక్. ఒకవేళ నయన్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మహేష్ సరసన మొదటి సారి నయన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని చెప్పవచ్చు. అలాగే మరో హీరోయిన్‏గా బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేయాలనుకుంటున్నారట మేకర్స్. అయితే ఆ హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వచ్చే ఈ మూవీ పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ అని డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఉంటుందని ముందు నుంచే కథనాలు వస్తున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనుండగా.. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా పూర్తైన తర్వాత ఈ హ్యాట్రిక్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన సర్కారు వారి పాట సినిమా షూటింగ్ జూలై 15 నుంచి తిరిగి ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. జీఎంబీ ఎంటర్ టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read: Vidya Balan: విద్యాబాలన్‌కు అరుదైన గౌరవం..! జమ్మూకశ్మీర్‌లోని ఓ మిలిటరీ ఫైరింగ్‌ రేంజ్‌కు ఆమె పేరు

Vijay Sethupathi : విక్రమార్కుడుగా విజయ్ సేతుపతి.. ‘ఆహా’ లో మరో ఇంట్రస్టింగ్ మూవీ..