ఐటీ అధికారులకు పార్లమెంటరీ కమిటీ సమన్లు…ఐటీ రూల్స్ పై విస్తృత చర్చ

ఐటీ అధికారులకు పార్లమెంటరీ కమిటీ సమన్లు...ఐటీ రూల్స్ పై విస్తృత చర్చ
Shashi Tharoor Led House Panel Summons To It Officials

ట్విటర్ ఇండియా నేపథ్యంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వాన గల పార్లమెంటరీ కమిటీ ఐటీ అధికారులకు సమన్లు జారీ చేసింది. డిజిటల్ స్పేస్ లో పౌరుల హక్కులకు సంబంధించిన అంశాలపై 'ముఖ్య ఆధారాలను సేకరించేందుకు సమన్లు పంపినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ట్విటర్ ఇండియా భారత ప్రభుత్వ నిబంధనలకు...

Umakanth Rao

| Edited By: Janardhan Veluru

Jul 06, 2021 | 10:23 AM

ట్విటర్ ఇండియా వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఐటీ అధికారులకు సమన్లు జారీ చేసింది. డిజిటల్ స్పేస్ లో పౌరుల హక్కులకు సంబంధించిన అంశాలపై ‘ముఖ్య ఆధారాలను సేకరించేందుకు సమన్లు పంపినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ట్విటర్ ఇండియా భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడచుకుంటున్నదా లేదా అన్న అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని ఈ వర్గాలు వెల్లడించాయి. ట్విటర్ ఎదుర్కొంటున్న కోర్టు కేసు,ఇటీవల కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, శశిథరూర్ అకౌంట్ల బ్లాక్ తదితర విషయాలను ఇందులో ప్రస్తావిస్తారని.. అంటే ఒక రకంగా ట్విటర్ ఇండియా మొండి వైఖరిని ఎండగడతారని భావిస్తున్నారు. ఈ సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ కమిటీ మీటింగ్ లో ఐటీతో బాటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా పాల్గొంటున్నారు. డిజిటల్ స్పేస్ లో మహిళల భద్రత అంశంతో బాటు సోషల్-ఆన్ లైన్ వేదికలపై న్యూస్ మీడియా దుర్వినియోగ నివారణ, అభ్యంతర కర కంటెంట్ల తొలగింపు వంటి వాటిపై తమ సమీక్షను ఈ సందర్భంగా అధికారులు ఈ కమిటీకి వివరించనున్నారు.

ముఖ్యంగా ట్విటర్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ…ఈ సామాజిక మాధ్యమానికి ఢిల్లీ పోలీసుల నోటీసుల విషయాన్ని వారు కమిటీ దృష్టికి తేనున్నారు. ప్రధానంగా ఏయే విషయాలను ప్రస్తావించాలో అందుకు సంబంధించిన అధికారిక అజెండాను సర్క్యులర్ రూపంలో పానెల్ తమ సభ్యులందరికీ పంపింది. కాగా ఐటీ నిబంధనలను ట్విటర్ అతిక్రమించిందని కేంద్రం నిన్న మళ్ళీ తాజాగా ఆరోపించింది. మీకు న్యాయ సహాయం ఉండదని హెచ్చరించినా ఈ సామాజిక మాధ్యమం తన దారిలోనే పోతోందని ఆరోపించింది.

మరిన్ని ఇక్కడ చూడండి:తేలు విషాన్ని చిమ్మడం మీరెప్పుడైనా చూశారా? విషం చిమ్ముతున్న స్లో మోషన్ వైరల్ అవుతున్న వీడియో..:Scorpion video.

గున్న ఏనుగు చిలిపి చేష్టలు..!మట్టిలో ఎంజాయ్ చేస్తున్న ఏనుగు పిల్ల వీడియో చూసి ఫిదా అవుతున్న నీటిజన్లు..:elephant play video.

సత్యదేవ్‌కు కొరటాల శివ ఊహించని గిఫ్ట్ .. సత్యదేవ్ హీరోగా స్టార్ డైరెక్టర్ సినిమా..:Koratala Siva and Satyadev video.

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ ను చుట్టుముట్టిన యాచకులు..కార్ ఎక్కిన వదలేదు..బ్రహ్మి కష్టమే నీకు అంటూ కామెంట్లు ..(వీడియో):Pragya Jaiswal Viral video.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu