Domestic Flights: కేంద్రం కీలక నిర్ణయం.. దేశీయ విమాన సర్వీసుల సామర్థ్యం పెంపు.. ఉత్తర్వులు జారీ..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Jul 06, 2021 | 10:18 AM

Central Government: దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు నాలుగు లక్షలకు నమోదైన కేసులు కాస్త.. ప్రస్తుతం 50 వేలకు దిగువన

Domestic Flights: కేంద్రం కీలక నిర్ణయం.. దేశీయ విమాన సర్వీసుల సామర్థ్యం పెంపు.. ఉత్తర్వులు జారీ..
Flight tickets

Follow us on

Central Government: దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు నాలుగు లక్షలకు నమోదైన కేసులు కాస్త.. ప్రస్తుతం 50 వేలకు దిగువన నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం పలు ఆంక్షలను ఎత్తివేస్తూ చర్యలు తీసుకుంటోంది. ఈ సడలింపుల్లో భాగంగా.. దేశీయ విమానాల సామర్థ్యాన్ని కేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 50 శాతం సామర్థ్యంతో దేశీయ విమానాలు నడుస్తుండగా.. అదనంగా మరో 15శాతం సర్వీసులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

కాగా.. మహమ్మారి సమయంలో విమానయానశాఖ దేశీయ చార్జీలు, సామర్థ్యం రెండింటినీ నియంత్రిస్తూ వచ్చింది. కరోనా పరిస్థితికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. అయితే.. అంతకుముందు కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంతో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో దేశీయ సర్వీసుల సామర్థ్యాన్ని 80 శాతం నుంచి 50 శాతానికి తగ్గిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా 65 శాతానికి పెంచిన సామర్థ్యం పరిమితి జూలై 31 వరకు లేదా తదుపరి ఆదేశాల వరకు వర్తిస్తుందని మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్‌కే. మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు ప్రభుత్వం గత వారం సామర్థ్యం పెంపుపై మినాశ్రయాల నిర్వాహకులు, సంస్థల నుంచి అభిప్రాయాలను కోరింది. ఆర్థికంగా క్లిష్ట స్థితిలో ఉన్న చాలా మంది వాటాదారులు ఎక్కువ దేశీయ విమానాలు నడిపేందుకు అనుమతించాలని కోరుతూ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం సామర్థ్యాన్ని 65శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విమానయాన సంస్థలకు కాస్త ఊరట కలగనుంది.

Also Read:

ఐటీ అధికారులకు శశిథరూర్ నేతృత్వాన గల పార్లమెంటరీ కమిటీ సమన్లు…ఐటీ రూల్స్ పై విస్తృత చర్చ

India Covid-19: గుడ్ న్యూస్.. భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 97 శాతం దాటిన రికవరీ రేటు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu