Love Marriage: తెలంగాణ అబ్బాయి.. నేపాల్ అమ్మాయికి పెళ్లి.. కాళ్లు కడిగి కన్యాదానం చేసిందెవరంటే..

Love Marriage: దేశాలు వేరు.. బాషలు వేరు.. అయితేనేం ప్రేమకు అవేమీ అడ్డుకాదని‌ నిరూపించింది ఓ జంట. ప్రపంచ దేశాల మధ్య ఆంక్షలు..

Love Marriage: తెలంగాణ అబ్బాయి.. నేపాల్ అమ్మాయికి పెళ్లి.. కాళ్లు కడిగి కన్యాదానం చేసిందెవరంటే..
Marriage
Follow us

|

Updated on: Jul 06, 2021 | 10:07 AM

Love Marriage: దేశాలు వేరు.. బాషలు వేరు.. అయితేనేం ప్రేమకు అవేమీ అడ్డుకాదని‌ నిరూపించింది ఓ జంట. ప్రపంచ దేశాల మధ్య ఆంక్షలు కొనసాగుతున్న ఈ కరోనా కాలంలోనూ మూడు ముళ్లతో ఏడడుగులు నడిచి ఒక్కటైంది ఈ జంట. అమ్మాయి నేపాల్.. అబ్బాయి తెలంగాణ.. కాగజ్ నగర్ కాగితపు కోటలో ముచ్చటగా మూడు ముళ్లతో హిందూ సంప్రదాయం ప్రకారం ప్రేమ వివాహం చేసుకున్నారు. కొవిడ్​ఆంక్షల కారణంగా అమ్మాయి తల్లితండ్రులు భారత్‌కు రాలేకపోవడంతో.. అబ్బాయి బంధువులే వదువు అమ్మానాన్నలుగా మారి కన్యాదానం జరిపించారు. ఈ అందమైన ప్రేమ వివాహం కొమురం భీం జిల్లా సిర్పూర్ టీ మండలంలో జరిగింది.

పూర్తి వివరాల్లోకెళకితే.. కొమురంభీం జిల్లా సిర్పూర్ టీ మండలానికి చెందిన అచ్యుత్ కుమార్.. ఖతార్‌లో మెకానికల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అక్కడే నేపాల్‌కు చెందిన రమీలతో ప్రేమలో పడ్డాడు. తమ ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు. దీంతో పెళ్లి.. అమ్మాయి స్వస్థలంలో జరిపించాలని అనుకున్న క్రమంలో.. కరోనా రెండో దశ విజృంభించింది. దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, ఎట్టకేలకు పలు ఆంక్షల మధ్య స్వదేశానికి చేరుకున్నాడు వరుడు అచ్యుత్. కానీ వధువు నేపాల్‌లోనే ఉండిపోయింది. ఎలాగైనా ఒక్కటవ్వాలనుకున్న ఆ జంట.. పెళ్లి పత్రికతో పాటు పలు ఆధారాలు అధికారులకు అందించారు. దీంతో వధువుతో పాటు తన సోదరుడిని మాత్రమే అధికారులు భారత్‌లోకి అనుమతించారు. పెళ్లి కూతురు అమ్మానాన్నలకు అనుమతి లభించలేదు. వారి స్థానంలో వరుడి మేనమామ, మేనత్తలు అమ్మాయికి అమ్మానాన్నలుగా మారి కన్యాదానం చేశారు. అంగరంగ వైభవంగా హిందూ సంప్రదాయ ప్రకారం వివాహం జరిపించారు పెద్దలు. ఈ ఇద్దరి జంట ఎంతో చూడముచ్చటగా ఉందని పెళ్లికి వచ్చిన పెద్దలు సైతం ఆనందం వ్యక్తం చేసి ఆశీర్వాదించారు.

Also read:

AP Employees: కోవిడ్‌ బారిన పడిన ఏపీ ఉద్యోగులకు 20 రోజుల ప్రత్యేక సాధారణ సెలవులు.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

India Covid-19: గుడ్ న్యూస్.. భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 97 శాతం దాటిన రికవరీ రేటు..

Tirumala Tirupati Devasthanam: టీడీడీ బోర్డుపై పీఏసీ పర్యవేక్షణ.. కీలక వ్యాఖ్యలు చేసిన పీఏసీ చైర్మన్ పయ్యావుల..