Srisailam Drone: డ్రోన్‌ డొంక కదులుతోంది. శ్రీశైలం మల్లన్న సన్నిధిలో నడిరాత్రి డ్రోన్‌ కదలికలపై దృష్టిసారించిన పోలీసులు

గుట్టురట్టవుతోంది. డ్రోన్‌ డొంక కదులుతోంది. నడిరాత్రి డ్రోన్‌ కదలికలపై దృష్టిసారించిన పోలీస్‌ యంత్రాంగం సీరియస్‌గా రియాక్టవుతోంది. అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని కూపీ లాగుతోంది.

Srisailam Drone: డ్రోన్‌ డొంక కదులుతోంది. శ్రీశైలం మల్లన్న సన్నిధిలో నడిరాత్రి డ్రోన్‌ కదలికలపై దృష్టిసారించిన పోలీసులు
Srisailam Drone
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 06, 2021 | 8:45 AM

Drone activity recorded over Srisailam temple: గుట్టురట్టవుతోంది. డ్రోన్‌ డొంక కదులుతోంది. నడిరాత్రి డ్రోన్‌ కదలికలపై దృష్టిసారించిన పోలీస్‌ యంత్రాంగం సీరియస్‌గా రియాక్టవుతోంది. అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని కూపీ లాగుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

శ్రీశైలంలో మరోసారి డ్రోన్‌ కెమెరాల కలకలం రేగింది. రాత్రి మరోసారి డ్రోన్‌ కెమెరాలు గాల్లోకి లేచాయి. శ్రీశైలం డ్రోన్ల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుల నిగ్గుతేల్చే పనిలో పడ్డారు. డ్రోన్లను కనుగొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎస్పీతో కర్నూలు ఎస్పీ ఫకీరప్ప మాట్లాడారు. తాము ఆపరేట్‌ చేయడం లేదని నాగర్‌కర్నూల్‌ ఎస్పీ సమాధానమిచ్చారు.

మరోవైపు.. సత్రాల్లో అనుమానితులను ప్రశ్నించారు పోలీసులు. ఈ సందర్భంగా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటు సున్నిపెంటకు చెందిన అనుమానిత వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుడి వద్ద నుంచి సీపీయూ, హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు. దేవస్థాన అధికారులు, పోలీసులు ఈ సంయుక్త ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు.

ఏ ప్రదేశంలోనైనా డ్రోన్‌ను ఆపరేట్‌ చేయాలంటే.. ఆ ప్లేస్‌కు ఐదారు కిలోమీటర్ల దూరం నుంచి మాత్రమే చేయాలి. వీడియో గట్రా ఏదైనా చేయాలనుకుంటే సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అలా ఎవరైనా పర్మిషన్లు తీసుకున్నారా? లెక్క తీస్తున్నారు అధికారులు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టారు. లాడ్జీల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Read Also….  Inspector farming: రైతుగా మారి అన్నదాతలతో కలిసి పొలం పనులు.. విరామ సమయాల్లో వ్యవసాయం చేస్తున్న పోలీస్ అధికారి