Top 10 TRP Ratings Movies: బార్క్ వచ్చిన తర్వాత అత్యధిక టీఆర్ఫీ రేటింగ్ ను సొంతం చేసుకున్న టాప్ 10 సినిమాలు ఏమిటో తెలుసా

Top 10 TRP Ratings Movies: సినిమా బిజినెస్ విషయంలో శాటిలైట్ రైట్స్ కూడా ప్రముఖ పాత్రను పోషిస్తాయి. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ సినిమా అంటే కోట్లను పెట్టి కొనుగోలు చేస్తారు. వెండితెరపై సూపర్ హిట్ సినిమాలు...

Top 10 TRP Ratings Movies: బార్క్ వచ్చిన తర్వాత అత్యధిక టీఆర్ఫీ రేటింగ్ ను సొంతం చేసుకున్న టాప్ 10 సినిమాలు ఏమిటో తెలుసా
Top 10 Movies
Follow us
Surya Kala

|

Updated on: Jul 06, 2021 | 3:04 PM

Top 10 TRP Ratings Movies: సినిమా బిజినెస్ విషయంలో శాటిలైట్ రైట్స్ కూడా ప్రముఖ పాత్రను పోషిస్తాయి. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ సినిమా అంటే కోట్లను పెట్టి కొనుగోలు చేస్తారు. వెండితెరపై సూపర్ హిట్ సినిమాలు బుల్లి తెరపై మంచి టీఆర్పీ రేటింగ్ నమోదు చేయాలనీ … ప్లాప్ మూవీస్ టీవీ ఛానల్ లో తక్కువ రేటింగ్ వస్తుందని లేదు.. ఎందుకంటే.. ప్రేక్షకుల అభిరుచి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా ఆ సినిమాను బుల్లి తెరపై టెలికాస్ట్ చేసే సమయం కూడా రేటింగ్ పై ప్రభావం చూపిస్తుంది. గతంలో తమ ఛానల్ లో ప్రసారమైన సినిమా ఇంత రెంటింగ్ ను నమోదు చేసింది అంటూ ఆ ఛానల్ వారే ప్రకటించేవారు. అయితే 2016 నుంచి BARC – బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా సంస్థ రంగంలోకి దిగింది. ఇండియా వైడ్ గా అన్ని టీవీ షోలు, సినిమాలు, న్యూస్ వంటి టి.ఆర్.పి వివరాలను ఈ సంస్థ ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో బార్క్ సంస్థ వచ్చిన తర్వాత బుల్లితెర పై రికార్డు టి.ఆర్.పి రేటింగ్ నమోదు చేసిన టాప్ 10 సినిమాలు ఏమిటో చూద్దాం.

2016 నుంచి ఇప్పటి వరకూ బుల్లి తెరపై ప్రసారమైన సినిమాలో టాప్ రేటింగ్ తో మొదటి ప్లేస్ లో ఉంది అల వైకుంఠపురములో మూవీ.

1.అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు కాంబోలో వచ్చిన ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ కొట్టింది. అలవైకుంఠ పురంలో మొదటి సారిగా బుల్లి తెరపై ప్రసరమైనప్పుడు ఏకంగా 29.4 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదుచేసింది. 2. సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ మూవీ బుల్లి తెరపై కూడా సూపర్ హిట్. ఈ సినిమా మొదటిసారిగా స్మాల్ స్క్రీన్ పై సందడి చేసినప్పుడు 23.4 టీఆర్పీ రేటింగ్ ను నమోదు చేసి సెకండ్ ప్లేస్ లో నిలిచింది. 3. తెలుగు చలన చిత్ర ఖ్యాతిని దేశ విదేశాల్లో చాటిన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి. ఈ సినిమా ఫస్ట్ టైం టీవీలో ప్రసరమైనప్పుడు 22.7 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుంది. 4. మహేష్ బాబుని డిఫరెంట్ లుక్ లో కొరటాల శివ సినిమా శ్రీమంతుడు. ఈ మూవీ మొదటిసారి బుల్లి తెరపై ప్రసారమైనప్పుడు 22.54 టీఆర్ఫీ రేటింగ్ ను నమోదుచేసింది. 5. అల్లు అర్జున్ హరీశంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ దువ్వాడ జగన్నాథం(డీజే ). ఈ సినిమా ఫస్ట్ టైం స్మాల్ స్క్రీన్ పై సందడి చేసినప్పుడు 21. టీఆర్ఫీ రేటింగ్ ను సొంతం చేసుకుని టాప్ 5వ ప్లేస్ లో నిలిచింది. 6) ప్రభాస్, రానా కాంబినేషన్ లో రాజమౌళి చెక్కిన చిత్రం బాహుబలి 1. ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పైనే కాదు.. స్మాల్ స్క్రీన్ పై కూడా సూపర్ హిట్ అయ్యింది. మొదటి సారిగా టెలికాస్ట్ అయినప్పుడు 21.54 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదుచేసింది. 7. వరుణ్ తేజ్ సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఫిదా. ఈ సినిమా మొదటిగా టీవీలో ప్రసారమై బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించింది. 21.31 టీఆర్ఫీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. 8. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీత గోవిందం. ఈ చిత్రం మొదటి సారి స్మాల్ స్క్రీన్ పై ప్రసారమై 20.8 టీఆర్ఫీ రేటింగ్ ను నమోదుచేసింది. 9. జూ. ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ జనతా గ్యారేజ్. ఈ సినిమా ఫస్ట్ టైం టీవీలో ప్రసరమైనప్ప్పుడు 20.69 టీఆర్ఫీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. 10. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి మూవీ వెండి తెరతో పాటు.. బుల్లి తెరపై కూడా సూపర్ హిట్. ఈ సినిమా మొదటిసారిగా బుల్లి తెరపై ప్రసరమైనప్పుడు 20.21 టీఆర్ఫీ రేటింగ్ ను నమోదు చేసుకుని టాప్ 10 ప్లేస్ లో నిలిచింది.

Also Read: కార్తీక్ నిర్దోషి నమ్మమని దీప కి చెబుతున్న సౌందర్య.. దీపకి పెళ్లి బట్టలు పెట్టడానికి రెడీ అవుతున్న మోనిత

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!