Singer Sunitha: మధురమైన గాత్రం.. చూడచక్కని రూపం.. వైరల్ అవుతున్న సింగర్ సునీత పోస్ట్..

టాలీవుడ్ అందాల సింగర్ సునీత.. తన మధురమైన గొంతుతో.. అందమైన రూపంతో ప్రేక్షకుల హృదయాతో స్థానం సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీఫుల్ సింగర్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Singer Sunitha: మధురమైన గాత్రం.. చూడచక్కని రూపం.. వైరల్ అవుతున్న సింగర్ సునీత పోస్ట్..
Sunitha
Follow us

|

Updated on: Jul 06, 2021 | 6:17 PM

Singer Sunitha: టాలీవుడ్ అందాల సింగర్ సునీత.. తన మధురమైన గొంతుతో.. చూడచక్కని రూపంతో ప్రేక్షకుల హృదయాల్లో  స్థానం సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీఫుల్ సింగర్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గాఉంటోంది. ఎన్నో ఏళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత ఇటీవలే వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. సింగ‌ర్‌గా, టెలివిజన్‌ యాంకర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌కు సమానంగా ఆమెకు ఫ్యాన్‌ పాలోయింగ్‌ ఉంది. సునీత తరచు తన ఫోటోలను, భర్త రామ్ ఫోటోలను షేర్ చేస్తూఆకట్టుకొంటోంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సింగర్ గానే కాదు హోస్ట్ గా ను పలు షోలకు జడ్జ్ గా ను వ్యవహరిస్తున్నారు సునీత. అయితే కరోనా కారణంగా ఇప్పటివరకు ఇంటికే పరిమితమైన సునీత కుటుంబసభ్యులతో మధురమైన క్షణాలను గడిపారు. కాగా ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో తిరిగి షూటింగ్ లతో బిజీ అవుతున్నారు. ఈ క్రామంలోనే తాను జడ్జ్ గా వ్యవహరిస్తున్న ఓ టీవీషో షూటింగ్ సమయంలో తీసుకున్న ఫోటోలను షేర్ చేసారు సునీత.ఈ ఫొటోల్లో అందమైన చీరలో కుందనపు బొమ్మలా కనిపించారు సునీత. ఫోటోలు పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే నెటిజన్లు లైకులు వర్షం కురిపిస్తున్నారు. సునీత ఫోటోలపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. సునీత అందమైన ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pawan Kalyan : పవన్ కాన్వాయ్ ను ఛేజ్ చేసిన ఫ్యాన్స్.. ఆ తర్వాత పవర్ స్టార్ట్ ఏం చేశాడో తెలుసా..

Chiranjeevi: ఆచార్య షూటింగ్ రీస్టార్ట్ .. చకచకా షూటింగ్ కంప్లీట్ చేయనున్న మెగాస్టార్..

Ariana Funny Dance Video: పిట్ట కొంచెం.. అందం అమోఘం.. మరి డ్యాన్స్‌ వేస్తేనో..?డాన్స్ వీడియోతో ఆకట్టుకుంటున్న అరియనా.