Marriage Gift: ఆ తండ్రి ఐడియానే వేరు.. కుమార్తె పెళ్లికి కట్నంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు.. ఎందుకంటే..?

Oxygen Concentrators Gifted: సాధరణంగా కుమార్తె వివాహం జరిగేటప్పుడు తల్లిదండ్రులు కట్నంగా ఆభరణాలు, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, కొంత నగదు, ఇంకా సామాన్లు లాంటివి ఇస్తుంటారు. ఇంకా పొలం, ప్లాట్లు లాంటివి

Marriage Gift: ఆ తండ్రి ఐడియానే వేరు.. కుమార్తె పెళ్లికి కట్నంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు.. ఎందుకంటే..?
Father Gifted Oxygen Concentrators
Follow us

|

Updated on: Jul 06, 2021 | 12:15 PM

Oxygen Concentrators Gifted: సాధరణంగా కుమార్తె వివాహం జరిగేటప్పుడు తల్లిదండ్రులు కట్నంగా ఆభరణాలు, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, కొంత నగదు, ఇంకా సామాన్లు లాంటివి ఇస్తుంటారు. ఇంకా పొలం, ప్లాట్లు లాంటివి కూడా రాసి ఇస్తుంటారు. అయితే.. కరోనా విజృంభణ నాటి నుంచి మారిపోయిన పరిస్థితులను గుర్తించిన ఆ యువతి కుటుంబసభ్యులు వరుడికి కట్నంగా రెండు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను ఇచ్చారు. పెళ్లి వేదికపై వధూవరులకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను ఇస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చోటుచేసుకుంది.

సుధీర్‌ గోయల్‌ అనే వ్యక్తి ఉజ్జయినిలోని అంబోడియాలో సేవాధామ్‌ ఆశ్రమాన్ని స్థాపించి, ప్రత్యేక అవసరాలు గల వారికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన కుమార్తె మౌనిక కూడా 25 ఏళ్లపాటు ఆశ్రమంలో సేవలు అందించింది. అయితే.. తాజగా తన కుమార్తె, మహారాష్ట్రకు చెందిన అంకిత్‌తో వివాహాన్ని జరిపించాడు. ఈ క్రమంలో తన కుమార్తెను వివాహాన్ని కూడా సేవా కార్యక్రమాలకు వేదికగా చేయాలనుకున్నారు. దీనిలో భాగంగా కొత్త అల్లుడికి ఎనిమిది హామీలు ఇచ్చారు. అందులో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను ఇవ్వడం.

హామీలో భాగంగా వధువు తండ్రి.. వరుడికి రూ.1.40 లక్షలతో కొనుగోలుచేసిన రెండు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను అందించాడు. అయితే.. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను తమ ప్రాంతంలో అవసరమైన వారికి అందిస్తామని ఈ సందర్భంగా వధూవరులు వాగ్ధానం సైతం చేశారు. అంతేకాకుండా పెళ్లికి ముందు వధూవరులు మొక్కలు సైత నాటారు. కరోనా విపత్కర పరిస్థితులను చూసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుధీన్ గోయల్ తెలిపాడు.

Also Read:

National Anthems: రికార్డు సాధించిన 17 ఏళ్ల కుర్రాడు.. 91 దేశాల జాతీయ గీతాల‌ను అలవోకగా ఆలపిస్తూ..

International Kissing Day 2021: ఆరోగ్యానికి ముద్దు ఎంతో మంచిది.. ముద్దుతో ఉన్న ప్రయోజనాలు ఏంటో తెలిస్తే..