Fuel Price Today: కొనసాగుతున్న బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మెట్రో నగరాల్లో..
Petrol - Diesel Price Today: దేశంలో చమరు కంపెనీలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో
Petrol – Diesel Price Today: దేశంలో చమరు కంపెనీలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర వంద మార్క్ దాటింది. దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ సహా అన్ని మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటింది. ఈ క్రమంలో చమురు కంపెనీలు తాజాగా పెట్రోల్‌పై 35, డీజిల్‌పై 10 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. జూలైలో ఇప్పటివరకు ఇంధన ధరలు దాదాపు ఏడుసార్లకు పైగా పెరిగాయి. తాజాగా పెరిగిన ధరలతో ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా.. కొత్తగా పెంచిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.100.56 కు చేరగా.. డీజిల్ రూ.89.62 కి పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.106.59 కి పెరగగా.. డీజిల్ రూ.97.18 కి చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.100.62 ఉండగా.. డీజిల్ రూ.92.65 కి చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ.101.37 కి చేరగా.. డీజిల్ ధర రూ.94.15 కి పెరిగింది. బెంగళూరులో పెట్రోల్ రూ.103.93 కి పెరగగా.. డీజిల్ రూ.94.99 కి చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.104.50 కి పెరగగా.. డీజిల్ రూ.97.58 కి పెరిగింది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర 104.05, డీజిల్ ధర 97.25 గా ఉంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.106.66 కి పెరగగా.. రూ. 99.26 కి చేరింది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 105.52 ఉండగా.. డీజీల్ ధర రూ.98.16 కి పెరిగింది.
Also Read: