Viral Video: బంజారా పాట.. రష్యాన్‌ల ఆట.. వీడియో చూస్తే మీరూ ఫిదా కావాల్సిందే.!

Viral Video: ఇండియన్‌ మ్యూజిక్‌ అంటే ఖండాంతరాలు సైతం ఊర్రుతలూగిపోతాయి. తాజాగా భారతీయ సంగీతానికి ఓ రష్యన్ బృందం అదిరిపోయే స్టెప్పులతో..

Viral Video: బంజారా పాట.. రష్యాన్‌ల ఆట.. వీడియో చూస్తే మీరూ ఫిదా కావాల్సిందే.!
Bangara Song
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 09, 2021 | 8:54 AM

ఇండియన్‌ మ్యూజిక్‌ అంటే ఖండాంతరాలు సైతం ఊర్రుతలూగిపోతాయి. తాజాగా భారతీయ సంగీతానికి ఓ రష్యన్ బృందం అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ వేస్తూ ఇరగదీసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట్లో సైతం వైబ్రేషన్స్‌ క్రియేట్‌ చేస్తోంది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

భాష లేనిది సంగీతం..ఆ సంగీతం అనే కళకు సరిహద్దులు కూడా లేవు..అలాంటి భారతీయ సంగీత కళలో ఓ మాయాజాలం ఉంది..మన దేశ పాటల బీట్స్‌కి ఎవరైనా కాలు కదపాల్సిందే..! రష్యన్‌ల బృందం పంజాబీలో ముండియన్‌ తు బాచ్‌ కే అనే ప్రసిద్థ పాటకు అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్‌ చేశారు. డ్యాన్స్‌ టీంలోని సభ్యులంతా భారతీయ వస్త్రధారణతో ఆకట్టుకుంటున్నారు. మహిళలు ఎరుపు లెహోంగా-చోలి ధరించగా.. పురుషులు కుర్తా-పైజామా ధరించి ఉన్నారు. సరియైన భావ వ్యక్తీకరణలతో నృత్యం చేస్తున్నారు.

కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు వారి నాట్యానికి, నటనకు ఫిదా అవుతున్నారు. కళకు సరిహద్దులు లేవు.. మీ డ్యాన్స్‌కి నేను ఫిదా! అంటూ నెటిజన్స్ కామెంట్‌ చేశారు.

Also Read:

రాత్రుళ్లు కోళ్లు మాయం.. బోను ఏర్పాటు చేయగా.. చిక్కిన జంతువును చూసి రైతు షాక్.!

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్.. గంటలో రూ. 1 లక్ష విత్‌డ్రా!

మొసలి, సింహాల భీకర పోరు.. గెలిచిందెవరు.? ఈ షాకింగ్ వీడియో మీకోసమే!