Viral Video: మొసలి, సింహాల భీకర పోరు.. గెలిచిందెవరు.? ఈ షాకింగ్ వీడియో మీకోసమే!
Lion Viral Video: అడవిలో సింహానిదే పూర్తి ఆధిపత్యం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అక్కడ చట్టాలు అన్నీ కూడా పూర్తి డిఫరెంట్‌గా ఉంటాయి...
అడవిలో సింహానిదే పూర్తి ఆధిపత్యం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అక్కడ చట్టాలు అన్నీ కూడా పూర్తి డిఫరెంట్‌గా ఉంటాయి. అడవికి రాజు సింహం అయితే.. నీటిలో అలెగ్జాండర్ మొసలి. సింహం ఆమడదూరంలో కనిపిస్తే చాలు మిగిలిన జంతువులు పరుగోపరుగు. అలాగే నీటిలో పెద్ద జంతువు ఏది ఉన్నా.. మొసలికి ఆహరం కావాల్సిందే. ఎందుకంటే నీటిలో ఉంటే మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. ఆ జంతువులు తలబడితే.. బీభత్సమే. మరి మొసళ్లను వేటాడేందుకు సింహాలు ఎలాంటి ఉచ్చు వేస్తాయో ఈ వీడియోలో చూద్దాం.
ఓ మొసలి నది ఒడ్డున సేద తీరుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సింహం దానిపై మెరుపు దాడికి దిగుతుంది. మరో మూడు సింహాలు కూడా అక్కడికి చేరుకొని మొసలిని ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి. అయితే మొసలి కూడా అంటే బలంగా ఎదురుదాడి చేస్తుంది. ఏదిఏమైనా సింహాలే పైచేయి సాధించాయి. ఇక మరో వీడియోలో మొసలి ఒడ్దు దగ్గర విశ్రాంతి తీసుకుంటుండగా.. వెనుక నుంచి ఓ చిరుత వచ్చి దానిపై దాడికి దిగుతుంది. దవడలతో మొసలిని పట్టుకుంటుంది. మొసలి నీటిలోకి వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా కూడా ప్రయోజనం లేకపోతుంది.
కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒకింత షాక్‌కు గురయ్యారు. సింహం, చిరుత చక్కటి వ్యూహాన్ని పన్ని మోసలిపై వేటకు దిగడం వారిని ఆశ్చర్యపరిచిందని చెప్పవచ్చు. ఈ వీడియోను ‘Jaat Entertainment’ అనే ఖాతా ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా.. ఇప్పటిదాకా 53 వేల మందికిపైగా పైగా ప్రజలు వీక్షించారు. వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.
Also Read:
ఏపీలో పాఠశాలల పున:ప్రారంభం అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి!
సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్.. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు టికెట్ ధరలు.!
కాబోయే భర్త రేప్ చేశాడంటూ మహిళ కేసు.. హైకోర్టు సంచలన తీర్పు.!
ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలెర్ట్.. అకడమిక్ క్యాలెండర్ షెడ్యూల్ ఖరారు.. మొత్తం 213 పనిదినాలు.!