High Court: కాబోయే భర్త రేప్ చేశాడంటూ మహిళ కేసు.. హైకోర్టు సంచలన తీర్పు.!

సదరు యువతీయువకులు పెళ్లి చేసుకునేందుకు సిద్దపడ్డారు. వారి కుటుంబాలు కూడా వాళ్ల వివాహానికి అంగీకరించాయి. పెళ్లికి సంబంధించి కొన్ని వేడుకలు కూడా పూర్తయ్యాయి...

High Court: కాబోయే భర్త రేప్ చేశాడంటూ మహిళ కేసు.. హైకోర్టు సంచలన తీర్పు.!
Mumbai Court
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 07, 2021 | 3:30 PM

సాధారణంగా మనం ఎన్నో వింత కేసులను చూస్తుంటాం.. అలాగే వింటూ ఉంటాం. అలాంటి కోవకు చెందిన ఓ కేసు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. తనకు కాబోయే భర్త తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. సదరు వ్యక్తికి బాంబే హైకోర్టు ముందుస్తు బెయిల్ మంజూరు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

సదరు యువతీయువకులు పెళ్లి చేసుకునేందుకు సిద్దపడ్డారు. వారి కుటుంబాలు కూడా వాళ్ల వివాహానికి అంగీకరించాయి. పెళ్లికి సంబంధించి కొన్ని వేడుకలు కూడా పూర్తయ్యాయి. అయితే అనూహ్యంగా కొద్ది నెలల తర్వాత వారి వివాహం నిలిచిపోయింది. అయినప్పటికీ ఇరువురూ ఒకరినొకరు కలుసుకునేవారు. అనేక సందర్భాల్లో శారీరికంగా కూడా దగ్గరయ్యారు. అయితే అతడు ఆమెను వివాహం చేసుకునేందుకు నిరాకరించడంతో.. ఆమె అత్యాచారం జరిగిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు వివరాలు ఇలా ఉన్నాయి..

2020 జనవరిలో ఓ మధ్యవర్తి ద్వారా వివాహ సంబంధం వచ్చిందని ఆ మహిళ పేర్కొంది. ఆ పెళ్లి ప్రతిపాదనను అంగీకరించామని.. ఆ తర్వాత వివాహనికి సంబంధించిన కొన్ని వేడుకలు కూడా జరిగాయని తెలిపింది. నవంబర్ 2020న వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయానికి వచ్చారు. అయితే కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పడటంతో.. 2021లో వివాహ మహోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈలోపు ఆ వ్యక్తి కుటుంబంతో యువతి సన్నిహితంగా మెలిగేది.

ఈ క్రమంలోనే 2021 మార్చి 2వ తేదీన బోరివ్లిలో ఉన్న తన ఇంటికి ఆ మహిళను రమ్మని సదరు వ్యక్తి ఆహ్వానించాడు. ఆ సమయంలోనే తనను లోబరుచుకున్నాడని మహిళ ఆరోపించింది. అంతేకాకుండా మరికొన్ని సందర్భాల్లో కూడా అతడు తనను లోబరుచుకున్నాడని.. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించాడని ఆ మహిళ తెలిపింది. దీనితో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసు విచారణను తాజాగా హైకోర్టు చేపట్టింది.

ఈ కేసుపై సదరు వ్యక్తి తరపు లాయర్ వాదిస్తూ.. ”డిసెంబర్ 2020లో వీరిద్దరి వివాహం కుటుంబ సమస్యల కారణంగా ఆగిపాయింది. ఆ తర్వాత పెళ్లి సాధ్యం కాదని తెలిసి కూడా ఆ మహిళ నా క్లయింట్‌తో శారీరిక సంబంధం పెట్టుకుంది. మహిళ అంగీకారంతోనే అదంతా జరిగినప్పుడు.. రేప్ కేసు కిందకు ఎలా పరిగణనలోకి తీసుకుంటారు” అని వాదించారు. అదే సమయంలో ప్రభుత్వ న్యాయవాది బెయిల్‌ రద్దు చేయాలంటూ కోరారు.

కాగా, వాదోపవాదాలు విన్న జస్టిస్ కొత్వాల్.. సదరు వ్యక్తికి ముందస్తు బెయిల్‌ను మంజూరు చేశారు. వివాహం జరగదని తెలిసి కూడా మహిళ శారీరిక సంబంధానికి అంగీకరించడంతో సదరు వ్యక్తిని దోషిగా నిర్ధారించలేమని.. ఏదిఏమైనా కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుండటంతో.. అంతకుమించి మాట్లాడటం సరైనది కాదని తెలిపారు. ఈ ఉత్తర్వుల వల్ల దర్యాప్తును, విచారణపై ఎలాంటి ప్రభావం ఉండకూడదని స్పష్టం చేశారు.

Also Read:

దర్జాగా రోడ్డుపై సింహాల నైట్ వాక్.. దడుసుకున్న స్థానికులు.. వీడియో వైరల్.!

టాయిలెట్ సీట్‌పై కూర్చున్న వ్యక్తి.. అంతలోనే ఊహించని షాక్.. మర్మాంగంపై కరిచిన పైథాన్.!

ఈ ఫోటోలో చిరుత ఉంది.. ఈజీగా గుర్తించవచ్చు.. ఎక్కడుందో కనిపెట్టండి.!